NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బహిరంగ సభను జయప్రదం చేయండి… 

1 min read

– జీపు జాతా ను ఉద్దేశించి మాట్లాడుతున్న సిపిఐ మండల కార్యదర్శి డి.రాజా సాహెబ్.

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఈనెల 2న పత్తికొండలో తలపెట్టిన సిపిఐ బస్సు యాత్ర బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఐ మండల కార్యదర్శి డి.రాజా సాహెబ్ పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని దూదేకొండ, కోతి రాళ్ల, పులికొండ, కనక దిన్నె, హోసూర్, పుచ్చకాయల మాడ గ్రామాలలో సిపిఐ ప్రతినిధి బృందం విస్తృతంగా ప్రచారం నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా వ్యతిరేక పాలక ప్రభుత్వాలను ఇంటికి సాగనంపి, రాష్ట్రాన్ని రక్షించుకుందాం- దేశాన్ని కాపాడుకుందాం అన్నారు. హంద్రీ,నీవా ద్వారా పత్తికొండ నియోజకవర్గం లో చెరువులన్నింటికీ నీళ్ళు నింపాలని డిమాండ్ చేశారు. కుడి, ఎడమ కాలువ పనులను తక్షణమే పూర్తి చేసి పంట పొలాలకు సాగునీరు అందించాలన్నారు. పత్తికొండ ప్రాంతం ఎడారిగా మారుతుందని, ఈ ప్రాంత కరువు విముక్తికి హంద్రీ,నీవా ఏకైక మార్గమని స్పష్టం చేశారు. పంట పొలాలకు నీళ్లు ఇచ్చి, ఆదుకోవాల్సిన ప్రజాప్రతినిధులు ఏమాత్రం ఈ ప్రాంతాన్ని పట్టించుకోకపోవడం ద్వారా గత పది సంవత్సరాల నుండి గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వారు పంట పొలాలు నీళ్లు ఇస్తామని, చెరులకు నీళ్లు మల్లి ఇస్తామని ఉత్తుత్తి వాగ్దానాలు చేస్తూ, పత్తికొండ నియోజకవర్గం ప్రజలను మభ్యపెట్టి ద్రోహం చేస్తున్నారని అన్నారు.దేవనకొండ రైతు రుణాలను మాఫీ చేసి, పత్తికొండ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలన్నారు. ఈనెల 2న పత్తికొండలో తలపెట్టిన బస్సు యాత్ర బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు లు హాజరవుతారని, రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, విద్యార్థి, యువజన సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు కారన్న, ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షులు రమేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

About Author