PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ ని పునరుద్ధరించాలి

1 min read

పాతపెన్షన్   విధానాన్ని పునరుద్ధరణ ధ్యేయంగా ఎ. ఐ. పి.టి.ఎఫ్. భారత రథయాత్ర: ఆప్టా

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆప్టా జాతీయ సమాఖ్య (AIPTF) జాతీయస్థాయిలో సిపియస్ ను రద్దు చేసి పాత పెన్షన్ని పునరుద్ధరించాలనే ఆశయంతో జాతీయస్థాయిలో  ఈ నెల 5 వ తేది జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నాడు దేశం లోని ఈ క్రింది నాలుగు  ప్రాంతాల నుంచి భారత రథ యాత్రను ప్రారంభించింది అవి (1) తురా -శిల్లోంగ్  (2) కన్యాకుమారి -తమిళనాడు(3) సోమనాథ్-గుజరాత్ (4) వాఘా బోర్డర్-పంజాబ్ , ఈ యాత్రలు అక్టోబరు5 తేదీన అంతర్జాతీయ ఉపాద్యాయ దినోత్సవం రోజున న్యూఢిల్లీలోని సిరిఫోర్ట్ ఆడిటోరియంలో సమావేశంతో ముగించనుంది. ఇందులో భారత యాత్ర 2 కన్యాకుమారి (తమిళనాడు) లో సెప్టెంబరు 5న ప్రారంభమై |తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి తరువాత తమిళనాడు లోని వెలూరు మీదుగా మన రాష్ట్రంలోని చిత్తూరు పట్టణానికి, సెప్టంబరు తే 15 దీన ఉదయం 11.45 నుండి 1.00 గంట లోపల చేరును. ఆ రోజు చిత్తూరులో సమావేశం, మీడియా సమావేశం తరువాత రాత్రి అనంతపురంలో బస చేసి ఉదయం అనంతపురంలో టీచర్ల తో సమావేశం, మీడియా సమావేశం తదనంతరం కర్నూలుకు 12 గంటలకు చేరి మీడియా సమావేశం, అనంతరం జోగులాంబ క్షేత్రం మీదుగా తెలంగాణ రాష్ట్రం లోనికి ప్రవేశిస్తుందని ఆప్టా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రకాశరావు గారు మీడియాకు తెలియజేసారు  ఈ యాత్ర లో అఖిల భారత ఉపద్యాయ సమాఖ్య జాతీయ  ఆర్ధిక కార్యదర్శి శ్రీ హరిగోవిందన్( కేరళ) నాయకత్వం ల ,శ్రీ బసవరాజ గురికర్ (కర్ణాటక) ఉపాధ్యక్షుడు ఎ. ఐ. పి.టి.ఎఫ్, శ్రీ రింగ రాజన్  డిప్యూటీ జెనెరల్ సెక్రటరీ ఎ. ఐ. పి.టి.ఎఫ్ వారు పాల్గొంటున్నారు, ఆంద్రప్రదేశ్ లో ఈ యాత్రకు శ్రీ .కె.ప్రకాశరావు జాతీయ కౌన్సిల్ సభ్యుడు ,అప్తా ప్రధాన కార్యదర్శి నాయకత్వం లో జరుగుతోందని అప్తా రాష్ట్ర అధ్యక్షుడు ఎ. జి.ఎస్.గణపతి రావు తెలియజేశారు ఈ యాత్ర  యొక్క ముఖ్య ఉద్దేశ్యం సి పి ఎస్ విధానము దేశ వ్యాప్తంగా రద్దు చేసి పాత పెన్షన్ విధానము ను పునరుద్ధరణ చేయటం.ఈ యాత్రకు రాష్ట్రం లో వున్న అన్ని ఉద్యోగ , ఉపాధ్యాయ సంఘాలు మరియు  సి పి ఎస్ రద్దు కొరకు ప్రయత్నం చేస్తున్న సంఘాలు అన్నీ మద్దతు పలికాయి.అందరూ పాల్గోని మా మధ్యన ఉన్న ఐక్యత ను చూపుతామని ఆప్టా నాయకులు రాష్ట్ర సహధ్యక్షుడు శ్రీ మెహదీ గారు తెలిపారు  చిత్తూరు, అనంతపురం జిల్లా సమావేశంలో ఎక్కువమంది ఉద్యోగ ఉపాధ్యాయ సోదర సోదరి మణులు పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని ఆప్టా రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ఎస్.నారాయణ రావు   కోరారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఢిల్లీలో ని సిరి ఫోర్ట్ ఆడిటోరియంలో కల్మినేషన్ సమావేశం తరువాత సి పి ఎస్  రద్దు మరియు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ కోరుతూ గౌరవ రాష్ట్ర పతి శ్రీమతి ద్రౌపది ముర్ముకి, గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీకి, గౌరవ ఆర్ధికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి AIPTF నాయకులు  మెమోరాండం ఇవ్వడంతో ఈ యాత్ర ముగుస్తుంది అని ఆంధ్ర ప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) నాయకులు తెలిపారు.

About Author