ప్రేక్షకాదరణ పొందుతున్న జీ తెలుగు కొత్త సీరియల్స్
1 min readపల్లెవెలుగు వెబ్ హైదరాబాదు: తెలుగు బుల్లితెరపై ఆకట్టుకునే సీరియల్స్తో సక్సెస్ ఫుల్ దూసుకుపోతున్న జీ తెలుగు ప్రారంభించిన నిండు నూరేళ్ల సావాసం, జగద్ధాత్రి సీరియల్స్ అంచనాలను మించి ప్రేక్షకులకు చేరువయ్యాయన్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా నిండు నూరేళ్ల సావాసం నటీనటులు ప్రేక్షకులతో కలిసి సిద్ధిపేటలో శ్రావణమాసం వరలక్ష్మీ వత్రాన్ని కూడా నిర్వహించారు. ఇక జగద్ధాత్రి సీరియల్కి అయితే ఏకంగా భారీ కటౌట్లే వెలిశాయి. ఖమ్మంలో జగద్ధాత్రి 40 అడుగుల భారీ కటౌట్ని ఏర్పాటు చేశారు. ఈ భారీ కటౌటికి అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.నిండు నూరేళ్ల సావాసం. ప్రేమ ఆప్యా యత మధ్య సాగే ఈ సీరియల్ రోజురోజుకీ ఆసక్తికర మలుపులతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సీరియల్లో అమర్, అరుంధతి, భాగమతి ప్రధాన పాత్రలు కాగా మనోహరి విలన్ గా అదరగొడుతోంది. అరుంధతి చనిపోవడం, అమర్ జీవితంలోకి రావాలని మనోహరి ప్రయత్నం, భాగమతి జీవితంలోకి అమర్ రావడంతో ఈ సీరియల్ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 7 గంటలకు ప్రసారమయ్యే నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూడాల్సిందే!ఇక ఆగస్టు 21న ప్రారంభమైన జగద్దాత్రి సీరియల్ ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన అందుకుంటోంది. ప్రోమో, టైటిల్ సాంగ్ విడుదల చేసినప్పటి నుంచే ఈ సీరియల్ కోసం ఆసక్తిగా ఎదురు చూశారు అభిమానులు. అన్నపూర్ణలా చల్లని దీవెనలు అందించే ఆ ఆదిపరాశక్తి పాపాత్ముల పాలిట అపరకాళిలా మారుతుందో మనందరికీ తెలుసు. ఈ సీరియల్లోనూ జగద్దాత్రి తన వాళ్ల పట్ల ప్రేమగా మసులుతూ. అమాయకంగా సాధారణ అమ్మాయిగా బతుకుతూనే జగద్ధాత్రి (జెడి) ఐపీఎస్ గా నేరస్థుల అంతుచూస్తుంది. జగద్దాత్రి జీవితంలో ఎలాంటి అవరోధాలను ఎదుర్కోబోతోంది? కౌశికి కుటుంబ సభ్యుల అసలు స్వరూపాన్ని తెలుసుకుంటుందా? వంటి విషయాలు తెలియాలంటే సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 గంటలకు ప్రసారమయ్యే జగద్దాత్రి సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!