PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్ఐ  అభ్యర్థుల దేహ దారుఢ్య పరీక్షలు పరిశీలన

1 min read

– రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ , అడిషనల్ డిజి శ్రీ అతుల్ సింగ్  ఐపియస్ .

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా రాయలసీమ జోన్ పరిధిలో కర్నూలు  APSP 2 వ  బెటాలియన్ లో జరుగుచున్న   ఎస్సై అభ్యర్థుల దేహదారుడ్య పరీక్షలను (AP SLPRB)  ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్  అతుల్ సింగ్  ఐపిఎస్ గారు సెలక్షన్ ఎంపికను  ఆరా తీసి, పరిశీలన చేశారు.అడిషనల్ డీజీ తో పాటు కర్నూల్ రేంజ్  డిఐజి శ్రీ ఎస్. సెంథిల్ కుమార్ ఐపియస్ , కర్నూలు 2 వ ఎపిఎస్పీ రేంజ్  బెటాలియన్ డిఐజి సిహెచ్. వెంకటేశ్వర్లు,  జిల్లా ఎస్పీ శ్రీ జి.కృష్ణకాంత్ ఐపియస్ , సెబ్ అడిషనల్ ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఐపియస్  ఉన్నారు.పోలీసు ఉన్నతాధికారులకు  పలు సూచనలు, సలహాలు చేసి దిశా , నిర్దేశం చేశారు.సిబ్బందికి బాగా పని చేయాలని సూచించారు.బయోమెట్రిక్, ఎత్తు, బరువు, చాతీ కొలతల పరికరాలను , కంప్యూటర్ లో సర్టిఫికెట్స్ అప్లోడ్ స్కానర్లు ,  వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.అనంతరం 1600 మీటర్లు పరుగు, 100 మీటర్లు పరుగు, లాంగ్ జంప్ ఈవెంట్స్ లను పరిశీలించారు.ఫిజికల్ మెజర్మెంట్ , ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లలో  పాల్గొన్న అభ్యర్థులతో  అడిషనల్ డీజీ అతుల్ సింగ్ ఐపియస్  కొద్దిసేపు మాట్లాడారు.అభ్యర్థులు బాగా రాణించాలన్నారు.అందరూ  అర్హత సాధించి , వ్రాత పరీక్షలు బాగా  రాసి ఎస్ఐ ఉద్యోగాలు సాధించాలన్నారు.ఈ కార్యక్రమంలో  ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ జి. నాగబాబు,  డిఎస్పీలు, సిఐలు ,ఆర్ఐలు, పాల్గొన్నారు.

About Author