ఈ నెల 19 న జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన
1 min read– కృష్ణగిరి మండలం లక్కసాగరం పంప్ హౌస్ వద్ద 68 చెరువులకు నీరు అందించే పథకాన్ని ప్రారంభించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి
– జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
పల్లెవెలుగు వెబ కర్నూలు: ఈ నెల 19 వ తేదీన జిల్లాలో ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణగిరి మండలం లక్కసాగరం పంప్ హౌస్ వద్ద 68 చెరువులకు నీరు అందించే పథకాన్ని ప్రారంభించనున్నారని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా గురువారం కృష్ణగిరి మండలం లక్కసాగరం పంప్ హౌస్ వద్ద పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి,జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య లతో కలిసి జిల్లా కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణగిరి మండలం లక్కసాగరం పంప్ హౌస్ వద్ద 68 చెరువులకు నీరు అందించే పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్న సందర్భంగా హెలిప్యాడ్, పైలాన్,ప్రారంభోత్సవానికి తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు .. హెలిప్యాడ్ కు తగిన స్థలాన్ని సాయంత్రం లోపు గుర్తించాలని సూచించారు..అలాగే ప్రారంభోత్సవానికి తగిన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో పత్తికొండ ఆర్డిఓ మోహన్ దాస్, ఆర్ అండ్ బి ఈఈ సురేష్, ఇరిగేషన్ డిఈ రామకృష్ణ, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.