ఆంధ్ర హాస్పిటల్స్ లో నవజాత శిశువుకు అరుదైన ఆపరేషన్
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ : ఆంధ్ర హాస్పిటల్స్ లో 15 రోజుల నవజాత శిశువుకు అరుదైన సర్జరీని నిర్వహించామని , డాక్టర్ పి. వీ. రామారావు, చీఫ్ ఆఫ్ చిల్డ్రన్స్ సర్వీసెస్ & డైరెక్టర్ తెలిపారు. స్థానిక సూర్యారావు పేటలోని మెయిన్ ఆంధ్ర హస్పటల్ లో గురువారంజరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెంకట శివనాగరాజు, దుర్గ దంపతులకు పుట్టిన శిశువుకు గ్లూకోస్ లెవల్స్ తగ్గటం వలన ఆకివీడులో డాక్టర్ మహేష్ పిల్లల హాస్పిటల్ నుంచి ఆంధ్ర హాస్పిటల్స్ కి పంపించారు. పుట్టినప్పుడు శిశువు బరువు 4.47 కే.జి ఉందని మూడవ రోజు ఇంటికి పంపించగా, ఆరవ రోజున బేబీ పాలు సరిగా తీసుకోకపోవటం వలన, ఆకివీడు పిల్లల హాస్పిటల్ కి వెళ్ళటం, అక్కడ రక్తంలో గ్లూకోస్ లెవల్స్ తగ్గటం మరియు ఇన్సులిన్ లెవల్స్ ఉండవలసిన ,దానికన్నా ఎక్కువ ఉండటం వలన, ఆంధ్ర హాస్పిటల్స్ కి ట్రీట్మెంట్ కోసం పంపించారు.ఆంధ్ర హాస్పిటల్స్ కి వచ్చిన తరువాత, గ్లూకోస్ లెవల్స్ బాగా పడిపోవటం, ఇన్సులిన్ లెవల్స్ ఇక్కడ కూడా ఎక్కువ ఉండటం వలన, చాల ఎక్కువ గ్లూకోస్ రక్తంలోకి ఇవ్వవలసిన అవసరం వచ్చింది. బేబి కి గ్లూకోస్ పెంచటానికి మందులు డైజెక్సిడ్ , ఆక్టిట్రియటైడ్,, హైడ్రోకార్డిసోన్, నిఫిడిపైన్, వాడవలసిన అవసరం వచ్చింది. ఈ మందులతో కూడ గ్లూకోస్ లెవల్స్ తగ్గలేదని అందు వలన, ఎమ్ ఆర్ ఐ, పెట్ స్కాన్లు చేశాము. దానిలో పాన్ క్రియాస్ గ్రంధిలో ఇన్సులినోమా అనే గడ్డ వున్నట్లుగా నిర్ధారణ అయింది.డాక్టర్ మేఘన, పిల్లల సర్జన్, నియర్ టోటల్ పాన్ క్రియాటక్టమీ అనే ఆపరేషన్ చేసి ఇన్సులిన్ ని తయారు చేసే ప్రాక్రియాస్ గ్రంధిని 90% పైన తీసేయటం జరిగింది.ఈ ఆపరేషన్ అయినతరువాత గ్లూకోస్ లెవల్స్ మాములు స్థాయికి వచ్చాయి. రెండు రోజులు వెంటిలేటర్ మీద ఉండి, ఇంటెన్సివ్ కేర్ లో పద్నాలుగు రోజులు ట్రీట్మెంట్ తరువాత ఇప్పుడు బేబీ మాములుగా పాలు తీసుకుంటూ, గ్లూకోస్ లెవల్స్ సాధారణ స్థాయికి వచ్చాయి. ఈ రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తున్నాము అని అన్నారు..ఈ కార్యక్రమంలో డాక్టర్ మేఘన, పిల్లల సర్జన్, డాక్టర్ భూజాత ,, నియోనాటాలజిస్ట్, ఇతర డాక్టర్ల బృందం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.