మట్టి వినాయకుల పై అవగాహన ర్యాలీ..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: శనివారం నాడు గడిగరెవుల జిల్లా ఉన్నత పాఠశాలలో మట్టి వినాయకులను విద్యార్థుల రూపొందించారు స్వయంగా మట్టి తెచ్చి తయారుచేసారు ఈ వినాయకులను నిమజ్జనం చేయడం వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని కలగదని రంగులు కలిపిన వినాయక ప్రతిమలను నదుల్లో కలపడం వల్ల నీరు వాతావరణం కాలుష్యం ఏర్పడే అవకాశం ఉందని ఈ సందర్భంగా విద్యార్థి విద్యార్థినులు అవగాహన కల్పించారు అనంతరం పర్యావరణం కాపాడడం మన బాధ్యత అంటూ పాఠశాల నుండి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు తయారుచేసిన వినాయక ప్రతిమలను సర్పంచ్ రామ్మోహన్ రెడ్డికి విద్యా కమిటీ చైర్మన్ కి చిన్నారులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఇన్చార్జి హెచ్ఎం దస్తగిరమ్మ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.