పిడిఎస్ యూ ఎస్ఎండి రఫీ అక్రమ అరెస్టును ఖండించండి
1 min read– సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పిలుపు
పల్లెవెలుగు వెబ్ నంద్యాల : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి డోన్ పర్యటనకు ఆటంకం కలిగిస్తారని ఉద్దేశంతో పిడిఎస్యు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎస్ ఎండి రఫీ ని సోమవారం అర్ధరాత్రి ముందస్తు హౌస్ అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్యని సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నంద్యాల డివిజన్ కార్యదర్శి ఎం శంకర్ ఖండించారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష పార్టీల నాయకులను వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులను ప్రశ్నించే వారిని అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆయన ప్రభుత్వ చర్యలను ఖండించారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం విద్యార్థుల సమస్యల పరిష్కారం కొరకు పిడిఎస్యు పోరాటాలు నిర్వహిస్తుందని విద్యా రంగ సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు ఎస్ ఎండి రపిని ముందస్తుగా అరెస్టు చేయటం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు రాజ్యాంగం కల్పించిన రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును హరించే విధంగా ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నాడని ఆయన విమర్శించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నియంతృత్వ ధోరణి విడనాడకపోతే భవిష్యత్తులో విద్యార్థుల నుండి ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు ఎస్ఎండి రఫీ అక్రమ అరెస్టును ప్రజాస్వామిక వాదులందరూ ఖండించాలని పిలుపునిచ్చారు మంగళవారం స్థానిక శ్రీనివాస సెంటర్ నందలి ఏపీ టి ఎఫ్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి ఎస్ చౌడప్ప డివిజన్ అధ్యక్షులు ఎస్ మహమ్మద్ ఆదర్శ భవన నిర్మాణ కార్మిక సంఘం డివిజన్ నాయకులు రఫీ కాజామియా మౌలిసా పి డి ఎస్ యు డివిజన్ నాయకులు సాదిక్,వినండి బాలాజీ నవీన్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.