కేంద్రం నిధులిస్తే.. పక్కదారి మళ్లిస్తారా..!
1 min read– సీఎం జగన్పై బీజేపీ మహిళా మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మోమిన్ షబానా
పల్లెవెలుగు వెబ్, ఆత్మకూరు: బిందు సేద్యం పరికరాల కోసం కేంద్ర ప్రభుత్వం నాబార్డు నిధులు మంజూరు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి మళ్లించడం ఏమిటని బీజేపీ మహిళా మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మోమిన్ షబానా ప్రశ్నించారు. ప్రధాన మంత్రి కృషి సంచాయ్ యోజన నిధులు, నాబార్డు నిధులు కలిపి మొత్తం రూ.1028 కోట్లు వ్యవసాయ బిందు సేద్యం పరికరాల కోసం కేటాయిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను పక్కదారి పట్టించిందని ఆరోపిస్తూ మంగళవారం బీజేపీ కార్యాలయంలో నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. దీక్షలో బీజేపీ మహిళా మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మోమిన్ షబానా మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి సత్యనారాయణ రెడ్డి, మండల ముస్లిం మైనార్టీ మోర్చా నూరు బాషా, ఎస్సీ మోర్చా మండల నాయకులు మహేష్ , కిసాన్ మోర్చా నాయకులు సుబ్రమణ్యం, రాజు తదితరులు దీక్షలో పాల్గొన్నారు.