ఉర్దూ అకాడమీలో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేయండి
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ : ఉర్దూ అకాడమీలో కరెంట్ అకౌంట్ లో ఉన్న 38 లక్షల రూపాయలను ఉన్నతాధికారుల ఆమోదం లేకుండానే ఖర్చు చేసిన ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మరియు సెక్రెటరీ అయూబ్ హుస్సేన్ పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖాజావలి డిమాండ్ చేశారు . స్థానికగాంధీనగర్ హోటల్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉర్దూ అకాడమీకి నిధుల కొరత ఉందని ఉర్దూ అకాడమీ కంప్యూటర్ కేంద్రాలకు సరైన సమయంలో అద్దెలు కూడా చెల్లించని పరిస్థితి ఉండంగా అయూబ్ హుస్సేన్ అప్పటి చైర్మన్ నదీమ్ అహ్మద్ అండతో నిధులను గోల్మాల్ చేశారని, ఆయన ఆరోపించారు. దీనిపై విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు తమకు జీతాలు పెంచమని కనీసం పే స్కేల్ అన్న ఇవ్వమని ఉర్దూ అకాడమీ ఉద్యోగస్తులు తమ యూనియన్ ఆధ్వర్యంలో మంత్రులకు మొర పెట్టుకోవడం జరిగిందని, ఆ యూనియన్ నాయకులు దీనిపై అధికారులను కలవటం కూడా కొంతమందికి ఇష్టం లేక యూనియన్ నాయకులపై అవినీతి ఆరోపణలు చేయటం సిగ్గుచేటని ఖాజావలి అన్నారు. 15, 20 సంవత్సరాలు నుండి ఉర్దూ అకాడమీలో చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు జీతాలు పెంచకుండా ప్రభుత్వం ఆటలాడుకుంటుందని ఆయన అన్నారు. ఉర్దూ అకాడమీ ఉద్యోగస్తులు కనీస వేతనాలకు సైతం నోచుకోలేదని ఒక పూట తిని ఒక పూట పస్తులుండి ఉద్యోగాలు చేస్తున్నారని ఆయన తెలియజేశారు వారిని ఆదుకోవాల్సిన ఉర్దూ అకాడమీ చైర్మన్ మరియు డైరెక్టర్లు ఆదుకోకుండా వారిని బెదిరించే స్థితికి వెళ్లటం దారుణమని ఆయన అన్నారు చిత్తూరు జిల్లాకు చెందిన డైరెక్టర్ శ్రీ కలీం గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులతో తిరుగుతూ ఉర్దూ ముసాయిరా ప్రోగ్రాం తెచ్చుకొని డబ్బులు తీసుకున్న మాట వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు .నిన్న కొంతమంది డైరెక్టర్లు ఉద్యోగస్తులను బెదిరించే ధోరణిలో మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు ఉద్యోగస్తులకు అండగా ముస్లిం హక్కుల పోరాడు సమితి నిలబడుతుందని ఆయన తెలియజేశారు ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మరియు కార్యదర్శి అయుబ్ హుస్సేన్ ప్రభుత్వం వద్ద నుండి హెచ్ ఆర్ ఏ తీసుకుంటూ ఉర్దూ అకాడమీ కార్యాలయంలోనే ఉంటున్న సంగతి వాస్తవం కాదా అని ప్రశ్నించారు ఉర్దూ అకాడమీ డైరెక్టర్లు మద్దతు ఇవ్వటం దీనికి నిదర్శనం అని ఆయన ప్రశ్నించారు. ఉర్దూ అకాడమీకి నూతనంగా చైర్మన్ ఎంపిక చేయకపోయినా ఉన్న డైరెక్టర్లు నదీమ్ అహ్మద్ చైర్మన్గా సంబోధించడం మంచిది కాదని వారన్నారు నదీమ్ అహ్మద్ పై పలు ఆరోపణలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికైనా అధికారులు మరియు బోర్డు డైరెక్టర్లు ఉద్యోగస్తులకు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో ముస్లిం హక్కుల పోరాట సమితి పల్నాడు జిల్లా అధ్యక్షులు షేక్ సిరాజ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ షాకీర్ మరియు నగర కన్వీనర్ షేక్ యాసిన్ లు పాల్గొన్నారు.