NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైభవంగా మేయర్ నూర్జహాన్ పుట్టినరోజు వేడుకలు..

1 min read

– శుభాకాంక్షలు తెలిపిన ఆళ్ళనాని, మున్సి పల్ కమిషనర్, అధికారులు, కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మాజీ డిప్యూటీ సీఎం, శాసనసభ్యులు ఆళ్ల నాని ఫోన్లో మేయర్ నూర్జహాన్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. శాసనసభ్యులు నాని ఇంటికి వెళ్లి ఆయన  ఆశీస్సులు తీసుకున్నారు. పవర్ పేటలోని మేయర్ క్యాంప్ కార్యాలయంలో గురువారం ఉదయం జరిగిన పుట్టినరోజు వేడుకలకు నగరంలోని అన్ని వర్గాలకు చెందిన ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్పొరేటర్లు కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్,అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, మున్సిపల్ అన్ని సెక్షన్ హెడ్స్ , గ్రామ వార్డు సచివాలయాల సెక్రటరీలు పెద్ద ఎత్తున తరలివచ్చి నూర్జహాన్ పెదబాబుకి శుభాకాంక్షలు తెలియజేశారు. నగరం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో యువకులు డాన్సులు చేస్తూ, తీన్మార్ డప్పు వాయిద్యాలు, గజమాలతో పవర్ పేట మేయర్ కార్యాలయానికి చేరుకుని మేయర్ నూర్జహాన్ తో కేకు కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తొలుత హిందూ, క్రిస్టియన్, ముస్లిం మత పెద్దలు సర్వమత ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ ఎంతో అభిమానంతో తరలివచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. పోణిoగి చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు గేదెల సూర్యనారాయణ మేయర్ దంపతులను కలిసి పుష్ప గుచ్చం అందించి కేక్ కట్ చేసి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author