PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చిన్నారుల తల్లులకు వ్యాక్సిన్…

1 min read

పల్లెవెలుగు వెబ్​, చాగలమర్రి : మండల కేంద్రమైన చాగలమర్రిలో ని 17వ అంగన్​వాడి కేంద్రంలో అంగన్వాడి టీచర్ చంద్రకళ, ఇందుమతి ఆధ్వరంలో ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు గురువారం వ్యాక్సిన్​ వేయించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్​ మండల సూపర్​వైజర్​ సుశీల రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రతి అంగన్వాడీ కేంద్రం పరిధిలో 0 నుండి 5 ఏళ్ల లోపు చిన్నారుల తల్లులను గుర్తించి వ్యాక్సిన్ వేస్తున్నామన్నారు. మొదటిరోజు 32 మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రెడ్డమ్మ, ఆరోగ్య కార్యకర్త మాధవి, అంగన్వాడి సహాయ కార్యకర్తలు సుజాత, రహమత్, ఆశ వర్కర్లు శివలక్ష్మి, సౌభాగ్య, తదితరులు పాల్గొన్నారు.

About Author