PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్కాలర్స్ స్కూల్లో దసరా సంబరాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలోని స్కాలర్ స్కూల్లో శుక్రవారం  దసరా సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్  దాసి సుధాకర్ రెడ్డి , కమీషనర్  పి‌.కిషోర్ హాజరయ్యారు. నవదుర్గల వేషధారణలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు  తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.  కార్యక్రమంలో స్కాలర్ స్కూల్ కరస్పాండెంట్ లక్ష్మీ , మరియు డైరెక్టర్ కాలూరు శివప్రసాద్ , శ్రీ నంది జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ బద్దుల శ్రీకాంత్ , నందికొట్కూరు పట్టణ ఉపాధ్యక్షులు చింతా విజ్జి  మరియు పాఠశాల ఉపాద్యాయులు, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు. 

About Author