దళితులకు స్మశాన వాటికల నిమిత్తం భూమి ని ప్రతిపాదించిన కలెక్టర్
1 min readపల్లెవెలుగు వెబ్ ఉయ్యూరు : కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం కుమ్మమూరు, బొడ్డపాడు, బద్రి రాజుపాలెం, గరికపాడు, గుర్వింద పల్లి, గ్రామాలలో దళితులకు స్మశాన వాటికల కేటాయింపు భూమి నిమిత్తం, కృష్ణా జిల్లా కలెక్టర్ పి. రాజబాబు ప్రతిపాదించారు అని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి రేవు ముత్యాలు రాజు సెప్టెంబర్ 17 2022న దళిత వాడల స్మశాన భూముల విషయమై జారీచేసిన ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఈ ప్రతిపాదనలు తయారు చేశారని తెలియజేశారు. ఈ మేరకు రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ పి. లక్ష్మణ రెడ్డికి తన నివేదికను సమర్పించారు ఈ 5 గ్రామాలలో స్మశాన వాటికల కేటాయింపు నిమిత్తం భూసేకరణ కోసం ఒక కోటి 80 లక్షల నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. తోట్లవల్లూరు మండలం కుమ్మమూరు, దళితవాడకు చెందిన స్మశాన భూమి విషయమై సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ గత జూలై నెలలో లోకాయుక్తకు ఫిర్యాదు చేయడం జరిగిందని, తెలిపారు. కొమ్మమూరు ఉత్తర దళితవాడలో 227 కుటుంబాలు ఉండగా, సర్వేనెంబర్ 210 లోని య.1– 98 సెంట్లు రోడ్డు మార్గంలో దహన క్రియలు నిర్వహిస్తున్నారు. కొమ్మమూరు దళితవాడతోపాటు బొడ్డపాడు బద్రిరాజుపాలెం , గరికపర్రు,, గుర్వింద పల్లి, గ్రామాలలో 4– 50 సెంట్లు భూ సేకరణ నిమిత్తం తోట్లవల్లూరు ,తాహసిల్దార్ శ్రీమతి ఎం కుసుమకుమారి, ఉయ్యూరు ఆర్డిఓ ఎన్ విజయకుమార్ జిల్లా కలెక్టర్ కు ప్రతిపాదించిన మేరకు జిల్లా కలెక్టర్ పి. రాజబాబు నిధులు మంజూరుకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.