ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలి
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: గడప-గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పగిడ్యాల మండలం, నెహ్రూ నగర్ 1 సచివాలయ పరిధిలోని పాత కొండ ప్రాగటూరు గ్రామంలోని ఎంపియుపి స్కూల్ మరియు అంగన్వాడి కేంద్రాలను నందికొట్కూరు శాసనసభ్యులు తొగురు ఆర్ధర్ తనిఖీ చేశారు.అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందిస్తున్న పోషకాహారం పాలు, గుడ్లను తనిఖీ చేశారు. మెనూ ప్రకారం అంగన్వాడీ కేంద్రాల్లో భోజనం ఏర్పాటు చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్ర కార్యకర్తలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం సరఫరా చేసే పౌష్టికాహారాన్ని పిల్లలకు, బాలింతలకు, గర్భిణీలకు అందజేయాలన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు ఏర్పాటు చేసిన భోజనం తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు .అనంతరం ఎంపియూపి పాఠశాలలో వసతులపై ఆరా తీసారు. విద్యార్థులకు అందిస్తున్న మద్యాహ్న భోజనం పథకం తీరును ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మంచి భోజనం అందించాలని వంట నిర్వహాకులకు సూచించారు. ఉపాద్యాయులు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని ఆయన సూచించారు.