NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చెత్తరహిత నగరమే లక్ష్యం

1 min read

– ఆదిశగా కృషి చేద్దాం..
– ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించిన మేయర్​ బీవై రామయ్య
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కర్నూలును పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దడమే మనందరి ప్రథమ కర్తవ్యమని..ఆ దిశగా ప్రజారోగ్య విభాగ అధికారులు పనిచేయాల్సిన అవసరముందని నగర మేయర్ బి.వై.రామయ్య స్పష్టం చేశారు. మునిసిపల్ కమిషనర్ డి.కె.బాలాజీ తో కలిసి కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయ కౌన్సిల్ హాల్ లో నగర పాలక ప్రజారోగ్య విభాగం అధికారులతో సమావేశమయ్యారు. మేయర్​ మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

రెగ్యులర్, ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు ఐ.డి కార్డు అందజేయాలని హెల్త్ ఆఫీసర్ భాస్కర్ రెడ్డిని ఆదేశించారు. కొందరు శానిటరీ ఇన్స్పెక్టర్లు బాధ్యతారహితంగా విధులు నిర్వర్తిస్తునట్లు తన దృష్టికి వచ్చిందని..వారు తమ లోపాలు సరిదిద్దుకోవాలని తెలియజేశారు. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులను నగర పాలక పరిధిలో ఏ డివిజన్ లో వారికి విధులు వేసినా కూడా పనిచేసేందుకు వారిని సిద్ధంగా ఉంచాలని శానిటరీ ఇన్స్పెక్టర్లకు సూచించారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ పద్మావతి, హెల్త్ ఆఫీసర్ భాస్కర్ రెడ్డి, శానిటరీ సూపర్ వైజర్ నాగరాజు, సూపరింటెండెంట్ మంజూర్ బాషా, డివిజన్ శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారుస

About Author