PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మత్తు పదార్థాలు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం

1 min read

– వచ్చే శీతాకాలంలో విద్యార్థులు చలికి బాధపడకూడదు..అవసరమైన హాస్టళ్లకు దుప్పట్లను సమకూరుస్తాం

– జిల్లా కలెక్టర్ డా.జి.సృజన

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  పాఠశాల పరిసరాల్లో మత్తు పదార్థాలు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన పేర్కొన్నారు.బుధవారం కలెక్టరేట్  నుండి వివిధ ప్రభుత్వ పథకాల అమలుపై  జిల్లా  అధికారులు మరియు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల తనిఖీల్లో భాగంగా సి.బెళగల్ మండలం, బురాన్ దొడ్డి -2 లోని ప్రభుత్వ పాఠశాల పరిధిలో మత్తు పదార్థాలు  విక్రయిస్తున్నట్లు  ఈ నెల 16 వ తేదీ తెలిసిందనీ,  అయినా ఈ అంశానికి సంబంధించి  చర్యలు తీసుకోవడంలో   డిఈఓ, ఎంఈఓ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అలసత్వం వహించారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పిల్లలు చదివే పాఠశాలల్లో ఇలాగే జరిగితే చూస్తూ ఊరికే ఉంటారా  అని కలెక్టర్ డీఈవో,ఎంఈవో ను ఆగ్రహం తో ప్రశ్నించారు..పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలైతే ఎవరు బాధ్యులు  అని కలెక్టర్ ప్రశ్నించారు. ఈ అంశంపై  కలెక్టర్  జిల్లా ఎస్పీ తో ఫోన్ లో మాట్లాడారు.. సంబంధిత పాఠశాల లో జరుగుతున్న విషయాన్ని ఎస్పీ కి వివరించి, చర్యలు తీసుకోవాల్సిందిగా  కలెక్టర్ ఎస్పీ కి సూచించారు…. సంబంధిత పాఠశాల  హెడ్మాస్టర్ తో కూడా ఫోన్ లో మాట్లాడి  ఈ అంశంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన రిపోర్టు కాపీని పంపవలసిందిగా హెడ్మాస్టర్ ను ఆదేశించారు.కన్సిస్టంట్ రిథమ్ కు సంబంధించి ప్రతి బుధవారం పాఠశాలలు, వసతి గృహాల్లో మహిళా పోలీస్, సంక్షేమ కార్యదర్శులు తనిఖీల్లో లేవనెత్తిన అంశాలను పరిష్కరించడంలో  కౌతాళం, పెద్దకడుబూరు మండలాలు వెనుకబడి ఉన్నాయని,  వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఎం ఈ ఓ లను ఆదేశించారు….. బిసి, ఎస్సీ, కెజిబివి వసతి గృహాల్లో సరైన దుప్పట్లు ఉన్నాయా లేదా అని తనిఖీ చేయాలని మండల స్థాయిలో ఎంపిడిఓలను, జిల్లా స్థాయిలో బిసి సంక్షేమ, ఎస్సీ సంక్షేమ శాఖల అధికారులను, పిఓఎస్ఎస్ఎ ను ఆదేశించారు..  దుప్పట్ల అవసరం ఉంటే తన దృష్టికి తీసుకువస్తే సమకూరుస్తామని కలెక్టర్ తెలిపారు..రాబోయే చలికాలం లో ఏ ఒక్క విద్యార్థి చలితో బాధపడకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు..తుగ్గలి మండలం, జొన్నగిరి పాఠశాలలో  లింగ వివక్షకు సంబంధించిన సమస్యను తనిఖీల్లో గుర్తించారని,  అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని తుగ్గలి ఎంఈఓను ఆదేశించారు. అదే విధంగా కన్సిస్టంట్ రిథమ్ లో భాగంగా తనిఖీల్లో గుర్తించిన సమస్యలను  ప్రతి రోజు తనకు  వివరించాలని డిఈఓను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో  చిన్నారులకు పుస్తకాలు అందించలేదని గుర్తించారని,   సంబంధిత అంగన్వాడీ సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసి తిరిగి అలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ పీడీ ని ఆదేశించారు.జగనన్న ఆరోగ్య సురక్షకు సంబంధించి సదరు క్యాంపులు పూర్తి అయిపోయిన తర్వాత వాలంటీర్ , ఎఎన్ఎం ఇంటింటికి వెళ్లి ఆరోగ్య శ్రీ యాప్ డౌన్లోడ్ చేయించాలని కలెక్టర్ ఎంపిడివో లను ఆదేశించారు.. గూడూరు, వెల్దుర్తి, మంత్రాలయం  తక్కువ శాతం డౌన్లోడ్ చేసుకున్నారని, ఎక్కువ మందికి యాప్ డౌన్లోడ్ చేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు.హౌసింగ్ కు సంబంధించి ఇళ్ల నిర్మాణ విషయంలో పత్తికొండ, కౌతాళం, తుగ్గలి, కోసిగి, మంత్రాలయం, ఆదోని, హాలహార్వి  తదితర మండలాలు పది రోజులుగా జీరో పురోగతి లో ఉన్నాయని,  సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని హౌసింగ్ పిడిని కలెక్టర్ ఆదేశించారు. ఆప్షన్ త్రీ విషయంలో హాలహర్వి, కోసిగి, ఎమ్మిగనూరు, కౌతాళం తదితర మండలాలు ఇంకా పనులు ప్రారంభించలేదని సంబంధిత ఎంపీడీవోలను ప్రశ్నించారు..  సోక్ పిట్ లు ఐహెచ్ఎల్స్ ను నిర్దేశిత  సమయంలో పూర్తి చేయాలని, ఈ కేవైసీ ప్రతి ఇంటికి చేయించాలని ఈ బాధ్యత ఎంపీడీవోలదే అని కలెక్టర్ స్పష్టం చేశారు.ప్రియారిటి బిల్డింగ్స్కు సంబంధించి అన్ని భవనాలను నవంబరు 30వ తేది నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు..భవన నిర్మాణాలను త్వరితగతిన స్టేజ్ కన్వర్షన్ చేయించాలని, అలాగే పూర్తి అయిన భవనాలు సంబంధిత శాఖలకు అప్పగించే బాధ్యత త్వరగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని స్వాధీనపరచాలని,  స్వాధీన పరుచుకోవడానికి ముందుకు రాని డిపార్ట్మెంట్ వారి పేర్లతో సహా కలెక్టర్ కు అందించాలని ఆదేశించారు.డ్వామాకు సంబంధించి అన్ని మండలాలకు 60 లక్షల రూపాయల పనులు మంజూరు అయ్యాయని, అందుకు సంబంధించి వర్క్ పూర్తి తో పాటు అన్ని వివరాలను పంపే ప్రక్రియను శుక్రవారం నాటికి పూర్తి చేయడంతో పాటు ఆధార్ సీడింగ్ కు సంబంధించి పెండింగ్ ఉన్న వాటిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ కు సంబంధించి తక్కువ శాతం గ్రౌండింగ్ నమోదైందని, వీటిలో గ్రౌండింగ్ శాతం పెంచాలన్నారు. చెత్త సంపద తయారీ కేంద్రాలకు సంబంధించి 53 రూఫ్ లెవెల్ ఉన్నాయని వాటిని త్వరితగతిన పూర్తి చేసేలా ఎంపిడిఓలు చర్యలు తీసుకోవాలన్నారు.నాడు-నేడు కు సంబంధించి వాలంటీర్లు ఇంకా 11,035 పిల్లలను సర్వే చేయాల్సి ఉందని, సదరు సర్వేను శుక్రవారం నాటికి పూర్తి చేయాలని, బేస్మెంట్ స్థాయిలో ఉన్న 38 అదనపు తరగతి గదుల ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. విద్యా శాఖకు సంబంధించి 5వ తరగతి నుంచి 6వ తరగతికి ఇంకా 559 విద్యార్థులు నమోదు కావాలని, 8వ తరగతి నుంచి 9వ తరగతి వరకు 693 మంది విద్యార్థులు నమోదు కావాల్సి ఉందని,  ఎంఈఓ లు ఈ అంశంపై చర్యలు తీసుకోవాలన్నారు.ఆడుదాం-ఆంధ్రాకు సంబంధించి అన్ని సచివాలయాల పరిధిలో మైదానాల గుర్తింపును సోమవారం నాటికి పూర్తి చేయాలన్నారు. ప్రతి మండలంలోని సంబంధిత అధికారులకు మాస్టర్ డేటా షీట్ పంపడం జరిగిందని అందులోని సదరు వివరాలను చెక్ చేసుకొని రేపు సాయంత్రం నాటికి తెలపాలన్నారు. అదే విధంగా క్రీడలను నిర్వహించేందుకు మైదానాల పరిస్ఠితిని తెలపడంతో పాటు వాటిని పరిశీలించడానికి పిఈటిలు మండల కేంద్రాలకు వస్తారని అందుకు వారికి తగిన సహాయ సహకారాలు అందజేయాలన్నారు. మండల అభివృద్ధి అధికారి మండలానికి క్రీడల అధికారిగా వ్యవహరించాలని సూచించారు. క్రీడలకు సంబంధించిన కిట్లు త్వరలో గ్రామాలకు పంపడం జరుగుతుందని తెలియజేశారు. జగనన్నకు చెబుదాం కు సంబంధించి మే 9వ తేది నుంచి ప్రారంభం అయిన కార్యక్రమంలో భాగంగా అర్జీ ఇచ్చిన ప్రతి ఒక్క అర్జీదారుడిని కార్యాలయానికి పిలిపించి సదరు అర్జీ యొక్క ఎండార్స్మెంట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా రీఓపెన్ అయిన అర్జీలకు తప్పనిసరిగా ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. మండల స్థాయి ఆడిట్ ను శనివారం నాటికి పూర్తి చేయాలని జిల్లా పరిషత్ సీఈఓ ను కలెక్టర్ ఆదేశించారు.సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, సిపిఓ అప్పలకొండ, హౌసింగ్ ఇంఛార్జి పిడి సిద్ధలింగమూర్తి, పంచాయతీ రాజ్ ఎస్ఈ సుబ్రమణ్యం, డ్వామా పిడి అమర్నాథ్ రెడ్డి, ఎస్ఎస్ఎ, పిఓ వేణుగోపాల్, డిఈఓ రంగారెడ్డి, సెట్కూరు సిఈఓ రమణ, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author