ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం
1 min read– ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా చైర్మెన్ డాక్టర్ ఎన్ తులసి రెడ్డి
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం లో రాష్ట్రానికి తీరుని అన్యాయం చేశారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ ఎన్ తులసి రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని చిత్తూరు రోడ్డులో వున్న కెజిఎస్ ఫన్షన్ హాల్లో అన్నమయ్య డిసిసి అధ్యక్షుడి ప్రమాణస్వీకారం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ రెడ్డి మోడీ భజన్ రెడ్డిగా మారారి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ప్రత్యేక హోదా సాధించడంలో వైసిపి పూర్తిగా విఫలమైందన్నారు.ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి, తెచ్చే శక్తి జాతీయ కాంగ్రెస్ పార్టీ కే సాధ్యమన్నారు.అన్నమయ్య డిసిసి అధ్యక్షుడి ప్రమాణస్వీకారంలో బుధవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు భాజపాచేతిలో కీలుబొమ్మగా మారారని,ఈనాలుగు పార్టీలకు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓడించి తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే ఐదు రాష్ట్రాలు రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గడ్, తెలంగాణ, మిజోరం సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ పవనాలు వీస్తున్నాయి అని, శుభ సూచికంగా కనిపిస్తున్నాయన్నారు.రాజంపేట పార్లమెంటరీ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిదని, 16 సార్లు ఎన్నికలు జరిగితే 11 సార్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోని కంచుకోటగా మారిందనిఆయన తెలిపారు. కేవలం టిడిపి రెండుసార్లు, వైసీపీ రెండుసార్లు, ఇండిపెండెంట్ ఒకసారి, మాత్రమే గెలుపొందారున్నారు.అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లోని 6 మండలాల్లో అతి త్వరలోనాయకులను ఏర్పాటుచేసి కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతామన్నారు.అనంతరం పిసిసి మీడియా చైర్మన్ తులసి రెడ్డి అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా షేక్ అల్లా బకాష్ ను ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా అల్లా బకస్ మాట్లాడుతూ రాష్ట్ర అధిష్టానం మాపై నమ్మకంతో పెద్ద అధ్యక్ష పదవి బాధ్యత అప్పగించిందని పైన ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఆకలి దప్పికలకు గురికావాల్సివచ్చిన ముందుకు సాగిపోతూ పార్టీ బలోపేతమే లక్ష్యంగా జిల్లాలో ప్రతి నియోజకవర్గం తిరిగి పార్టీ అభివృద్ధి కోసం పని చేస్తానని అన్నారు . ఈ పదవి రావడానికి సహకరించిన ప్రతి నాయకునికి ప్రతి కార్యకర్తకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు .ఈ కార్యక్రమంలో పిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నజీర్ అహ్మద్ రాజంపేట బాధ్యురాలు గోసాల దేవి, కడప డిసిసి అధ్యక్షుడు గుండ్లకుంట శ్రీరాములు, తంబళ్లపల్లె కన్వీనర్ సోమశేఖర్ రెడ్డి, రాజంపేట కన్వీనర్ ఎం ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, పీలేరు కన్వీనర్ రెడ్డి సాహెబ్, పుంగనూరు కన్వీనర్ రామచంద్ర, రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ శాంతయ్య , రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుడు మహమ్మద్ రఫీ, డిసిసి మైనార్టీ అధ్యక్షుడు మన్సూర్ అలీ ఖాన్ , ఆర్టిఐ జిల్లా చైర్మన్ అమీర్ భాష, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు చెన్న కృష్ణ, అన్నమయ్య జిల్లా మీడియా చైర్మన్ నరేష్, పట్టణ అధ్యక్షుడు ఖాదర్ ఖాన్, యూత్ లీడర్ ఖాదరవల్లి, తాలూకా మహిళా అధ్యక్షురాలు రవణమ్మ, లక్కిరెడ్డిపల్లి మహిళా కాంగ్రెస్ నాయకురాలు మహబూబ్ జాన్, కాంగ్రెస్ లీడర్లు మహమ్మద్ రఫీ, దినకర్, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.