జిల్లాను కరువు జిల్లా గా ప్రకటించి రైతులను ఆదుకోండి..
1 min read– కరువు పై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం….
జిల్లా ను కరువు జిల్లాగా ప్రకటించకపోతే ఆందోళన తీవ్ర తరం చేస్తాం
దేవనకొండ టర్నింగ్ లో రైతు ,వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గంటకు పైగా రోడ్డు దిగ్బంధన కార్యక్రమం…
అధికారుల హామీతో దిగ్బంధన కార్యక్రమం విరమణ.
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: కర్నూలు జిల్లా ను కరువు జిల్లా గా ప్రకటించి రైతులను ఆదుకోవాలని,జిల్లాకు ముఖ్యమంత్రి వచ్చిన రైతాంగానికి భరోసా లేకుండా మొక్కుబడి కార్యక్రమాలు చేసి వెళ్లిపోవడం బాధాకరమని జిల్లా పశ్చిమ ప్రాంతంలో వ్యవసాయం మీద ఆధారపడివేలాదికుటుంబాలుబతుకు తున్నాయని వారిని ఆదుకునేందుకు జిల్లాని కరువు జిల్లా గా ప్రకటించి ప్రజానీకాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీర శేఖర్, జిల్లా రైతు సంఘం నాయకులు వి. రంగారెడ్డి లు డిమాండ్ చేశారు.శుక్రవారంనాడు ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం,వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రమైన దేవనకొండ టర్నింగ్ నందు రోడ్డు దిగ్బంధన కార్యక్రమాన్ని చేపట్టారు. భారీ సంఖ్యలో వచ్చిన రైతు, వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలు రైతుల నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. జిల్లాను కరువు జిల్లా గా ప్రకటించాలని, రైతుల బ్యాంకుల మరియు అన్ని రకాల రుణాలు మాఫీ చేయాలని, నష్టపోయిన రైతులకు ఎకరాకు 30 వేల రూపాయల నుండి 50 వేల వరకు నష్టపరిహారం చెల్లించాలని, వాతావరణ బీమా పరిహారము ఇవ్వాలని, బోర్ల కింద బావుల కింద వేసిన పంటలకు 9 గంటల విద్యుత్ ఇవ్వాలని, ఉపాధి హామీ పనులు అడిగిన వారందరికీ పని కల్పించి వలసలు ఆపాలని డిమాండ్ చేస్తూూ, . పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దాదాపు గంటసేపు కు పైగా రోడ్డు దిబ్బందనం చేశాారు. గంటసేపు రోడ్డు దిగ్బంధనం చేసినప్పటికీ ప్రయాణికుల నుండి వ్యతిరేకత రాకపోగా బస్సులలో నుండి దిగివచ్చి ఆందోళన చేస్తున్న రైతు ,వ్యవసాయ కార్మిక సంఘం నాయకులకు సంఘీభావం తెలపడం విశేషం.ఆర్డీవో వచ్చి హామీ ఇవ్వాలని అన్నప్పుడు ప్రయాణికులు కూడా స్వరం కలిపారు. దేవనకొండ తాసిల్దారు వెంకటేష్ నాయక్ వాహనాల రాకపోకలు ఆగిపోగా అందులో ఆయన వాహనం కూడా ఇరుక్కుపోయి అక్కడే ఆగిపోయారు. ఆందోళన శాంతియుతంగా జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సూరి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో. రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు G.రామకృష్ణ వీరశేఖర్, రంగారెడ్డి, పి హనుమంతు, బాలకృష్ణ లు మాట్లాడుతూ… జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులవల్ల కరువు తీవ్రత చాలా విపరీతంగా ఉందని ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో పట్టుమని పది రోజులు కూడా వర్షం వచ్చిన దాఖలాలు లేవని పత్తి, ఉల్లి ,వేరుశనగ ,కంది ,ఆముదము సద్దలు, మిరపటమేటా వంటి పంటలకు వేలకు వేల పెట్టుబడులు పెట్టి వ్యవసాయాన్ని చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఎండిపోయిన పంటలను పీకి వేసిన పరిస్థితి ఉంది. గత సంవత్సరం ఈ సంవత్సరం వెక్కిరిస్తున్న కరువు వల్ల రైతుల తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు.నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం ఆదుకునే నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. జిల్లాను కరువు జిల్లా గా ప్రకటించి ఎకరాకు 30 వేల పరిహారం ఇవ్వాలని, బ్యాంకులలో వ్యవసాయంపై తీసుకున్న అన్ని రకాల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గత రెండు నెలల కాలంలో ఉమ్మడి జిల్లాలో రెండు సార్లు పర్యటన చేశారని అయినా కరువు పై మాట్లాడకపోవడం చాలా దారుణమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వచ్చినప్పుడు వామపక్ష ప్రజాసంఘాల నాయకులను అరెస్ట్ చేయడం తప్ప ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని అన్నారు. జిల్లాలో ఏర్పడిన తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యం జిల్లా పశ్చిమ ప్రాంతం మీద తీవ్ర ప్రభావం చూపి రోజుకు వందలాదిమంది పొట్ట చేత్తో పట్టుకుని బతుకు జీవుడా అంటూ, బ్రతకడానికి వలస వెళుతున్నారని, వలసలు అరికట్టే చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోకపోవడం దారుణం పేర్కొన్నారు. కరువు పై వెంటనే ప్రభుత్వం ప్రకటన చేయాలని అదేవిధంగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించి కరువు పై తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఒకవైపు కరువు అరకొరగా పండిన పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడం వలన టమోటా ఇతర వాణిజ్య పంటలు వేసుకున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. టమోటా పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతులకు 9 గంటలు విద్యుత్ ఇస్తున్నామన్న ప్రభుత్వం కేవలం ఐదు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తుందని దీనివలన పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టం జరుగుతుందని తెలిపారు. వ్యవసాయానికి 9 గంటల నిరంతరాయ విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరువు నేపథ్యంలో పశువులకు పశుగ్రాసం ఉచితంగా సరఫరా చేయాలని, వలసల నివారణకు అడిగిన వారందరికీ ఉపాధి పనులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. జిల్లాను కరువు జిల్లా గా ప్రకటించకపోతే ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు హెచ్చరించారు.రోడ్డు దిగ్బంధన కార్యక్రమం నేపథ్యంలో పత్తికొండ ఆర్డిఓ గారు వచ్చి కరువు పై స్పష్టమైన ప్రకటన చేసి హామీ ఇచ్చిన తర్వాతనే దిగ్బంధన కార్యక్రమం విరమిస్తామని రైతు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు స్పష్టం చేసిన నేపథ్యంలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడే ఉన్న తాసిల్దారు వెంకటేష్ నాయక్ వచ్చి ఫోన్లో ఆర్డిఓతో నాయకులతో మాట్లాడించిన ఆర్డీవో హామీ మేరకు అదేవిధంగా వ్యవసాయ అధికారి ,విద్యుత్ ఏ ఇ, దేవనకొండ ఎస్సై భూపాలుడు ల ,హామీతో ధర్నా కార్యక్రమాన్ని విరమించి రాస్తారోకో కార్యక్రమాన్ని విరమించారు.ఈ కార్యక్రమంలో రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు తుగ్గలి శ్రీరాములు,రంగస్వామి, ఆస్పరి రంగస్వామి, రామాంజనేయులు దేవనకొండ మండల నాయకులు నాగేష్, మహబూబ్ బాషా, బజారి, తెర్నేకల్లు శ్రీరాములు, బడే సాబ్, లింగన్న ,సుధాకర్, సుంకన్న ,డివైఎఫ్ఐ మండల కార్యదర్శి శ్రీనివాసులు, వీరేంద్ర, రసూల్ ,పల్లె దొడ్డి నాగేష్, రమేష్ ,రాయుడు, మహేంద్ర, బలరాముడు, బండ్లయ్య తో పాటు వందలాదిమంది రైతులు పాల్గొన్నారు.