గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : గ్రామీణ ప్రాంతాల అభివృదే ప్రభుత్వ లక్ష్యమని కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు, గురువారం స్థానిక కొత్త రోడ్డు నుండి వనం ఇదివరకు రోడ్డుకు రెండో వైపు డ్రైనేజీ పనులకు ఆయన తన తనయులు చింత కొమ్మదిన్నె జడ్పిటిసి పోచం రెడ్డి రామాంజనేయులు రెడ్డి తో కలిసి భూమి పూజ నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు, అందులో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో డ్రైనేజీలు, రోడ్లు పనులను యుద్ధ ప్రాతికపదిన పూర్తి చేయడం జరుగుతుందన్నారు, అందులో భాగంగానే చెన్నూరు టౌన్ కొత్త రోడ్డు నుండి వనం వీధి వరకు కొన్ని నెలల క్రిందట 70 లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణం, ఒకవైపు డ్రైనేజీ పనులు చేపట్టడం జరిగిందన్నారు, అలాగే ఇప్పుడు రెండో వైపు 28 లక్షల 50వేల రూపాయలతో డ్రైనేజీ పనులు ప్రారంభించడం జరిగిందన్నారు, వర్షం వచ్చిందంటే కొత్త రోడ్డు మీద నుండి పాత రోడ్డు మీదకి వెళ్లాలంటే ప్రజలు ఎంతో ఇబ్బందులు పడేవారని నేడు అలాంటి దుస్థితి లేకుండా సౌకర్యంగా వాహనాలు, బాటసారులు వెళ్లే విధంగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందన్నారు, అంతేకాకుండా మండల వ్యాప్తంగా ఎక్కడ ఈ సమస్య ఉన్న వాటిని తమ దృష్టికి తీసుకు వచ్చినట్లయితే ఆ పనులు వెంటనే చేపట్టే విధంగా చర్యలు చేపడతామని ఆయన తెలియజేశారు, ఈ కార్యక్రమంలోఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జీయన్ భాస్కర్ రెడ్డి, సొసైటీ ప్రెసిడెంట్ అల్లి శ్రీరామ్మూర్తి, వైఎస్ఆర్సిపి టౌన్ కన్వీనర్ ముదిరెడ్డి సుబ్బారెడ్డి, గణేష్ రెడ్డి, ఎంపీటీసీలు నిరంజన్ రెడ్డి, సాదిక్ అలీ, రఘురాం రెడ్డి, సర్పంచులు సిద్ది గారి వెంకటసుబ్బయ్య, సొంతం నారాయణ రెడ్డి, తుంగ చంద్రశేఖర్ యాదవ్, మైనార్టీ నాయకులు అబ్దుల్ రబ్, వారిస్, సాదు కిషోర్, హస్రత్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వినోద్ కుమార్, కార్యదర్శి రామ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.