గతానికీ…ఇప్పటికీ తేడాను గమనించండి
1 min read-ప్రతి పేదవారికి మన ప్రభుత్వం అండగా ఉంటుంది
-సచివాలయ వ్యవస్థతో ఇంటి వద్దకే పథకాలు
– మరోసారి జగన్‌ను సీఎం చేసుకుందాం
– గూళ్యం గ్రామంలో ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమం
నూతన హాలహర్వి సి.యస్ చర్చ్ కాంపౌండ్ ప్రారంభోత్సవం
మంత్రి గుమ్మనూరు స్వంత నిధులు 8లక్షలు నిర్మాణంతో పూర్తి..
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం
పల్లెవెలుగు వెబ్ ఆలూరు : చంద్రబాబు పాలనకు,జగన్ పాలనకు మధ్య తేడాను ప్రజలు గమనించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం సూచించారు. ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో భాగంగా నిన్న మంగళవారం సాయంత్రం ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం హాలహర్వి మండలంలోని గూళ్యం గ్రామంలోని సచివాలయం-1 పరిధిలోని పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో 1వ సచివాలయం పరిధిలో చేపట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల బోర్డును ఆవిష్కరించి ప్రసంగించారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో దోపిడీ కొనసాగిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చాక సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. సీఎం జగన్‌కు, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుండడంతో అక్కసుతో ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సంక్షేమ పథకాలను ఏనాడూ ఆపలేదని గుర్తు చేశారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఒక్క వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే సాధ్యమైందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలతో అటు అధికార యంత్రాంగం..ఇటు వైసీపీ శ్రేణులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నారని తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లేకపోతే జన్మభూమి కమిటీలే మళ్లీ వస్తాయని, వాళ్లు చేసిన అరాచకాలు ఎలాంటివో మళ్లీ తాను చెప్పాల్సిన అవసరం లేదన్నారు. గ్రామంలో మూడు సచివాలయంలో వల్ల 60కోట్ల 1లక్ష రూపాయలు నిధులు సంక్షేమ పథకాలు,అభివృద్ధి పనులు నాలుగున్నరేళ్లలో కనీవినీ విధంగా అభివృద్ధి చేశామని తెలిపారు.రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రిని చేసుకునే యజ్ఞంలో ప్రతి ఒక్కరూ కదంతొక్కలని,జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతే జరగబోయే మంచిని ప్రజలందరికీ తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని హాజరైన నాయకులకు సూచించడం జరిగింది..ఈ కార్యక్రమంలో మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి ,జడ్పీటీసీ లింగప్ప,గ్రామ సర్పంచ్ ఉలిగమ్మ,మండల కన్వీనర్ భీమప్ప చౌదరి,జిల్లా ప్రధాన కార్యదర్శి యశోద,జిల్లా కార్యదర్శి రాంభీం నాయుడు మండల జేసీయస్ కన్వీనర్ రంజిత్,గ్రామాల్లో నాయకులు బజారప్ప,లింగమల్లప్ప,వన్నూరుప్ప,రాజశేఖర్ పలువురు ప్రజాప్రతినిధులు, వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.