PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేదలకు అండగా నిలవాలన్నదే లక్ష్యం 

1 min read

– హక్కుల పరిరక్షణే ధ్యేయం… జాతీయ చైర్మన్ కాసల కోనయ్య 

పల్లెవెలుగు వెబ్  కడప: తమ హక్కులను తెలుసుకోలేక నిర్లక్ష్యానికి గురౌతున్న పేద బడుగు బలహీన వర్గాల పేదలకు అండగా నిలవాలన్నదే తమ లక్ష్యమని ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు కాసల కోనయ్య అన్నారు గురువారం స్థానిక అక్కాయపల్లె లోని ఓ ప్రయివేటు పాఠశాలలో సంఘం జిల్లా పరిశీలకులు కానగల సుబ్బరామయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో కోనయ్య మాట్లాడారు నేటికీ దేశంలో అణగారిన వర్గాల హక్కులు కాలరాయబడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు ఎక్కడైతే హక్కులు ఉల్లంఘించబడతాయో అక్కడ తాము నిలబడి మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తామని చెప్పారు దేశంలో 28 రాష్ట్రాల్లో తమ సంఘం వ్యాపించి ఉందన్నారు ప్రతి ఒక్కరూ తమ హక్కులు తెలుసుకొంటే నే ప్రగతి పథంలో పయనిస్తారని చెప్పారు  112 దేశాల్లో ఆహారం కొరత తీవ్రంగా ఉందని అందులో మన దేశం చాలా వెనుక బడి ఉందన్నారు 60 కోట్ల మంది ప్రజలకు ఇప్పటికీ ఆహారం అందడం లేదని మండిపడ్డారు తమ సంఘం లో ఎంతో మంది మేధావులు, అనేక మంది రిటైర్డ్ ఉన్నతాధికారులు ఉన్నారని చెప్పారు రాష్ట్ర మీడియా విభాగం చైర్మన్ రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ నేటికీ దేశ ప్రజలు పేదరికం లో మగ్గిపోతున్నారని వాపోయారు ప్రజలకు హక్కులను తెలియజెప్పి అవగాహన కల్పించడ మే తమ ప్రధాన ఉద్దేశ్యమన్నారు అణగారి పోతున్న హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరీ భాద్యత అన్నారు  కడప జిల్లా పరిశీలకులు  కానగల సుబ్బరామయ్య మాట్లాడుతూ అసోసియేషన్ విధి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి హక్కుల కోసం పోరాటం చేస్తామని చెప్పారు జిల్లా వ్యాప్తంగా సంఘాన్ని బలోపేతం చేస్తామని చెప్పారు తమ సంఘం కులాలకు, మతాలకు అతీతంగా పని చేస్తుందని మానవ హక్కుల పరిరక్షణే సంఘం ముఖ్య ఉద్దేశ్యమ న్నారు ఇందులో రాయలసీమ రీజనల్ అబ్జర్వర్ గా పోతురాజు లోకేష్, పులివెందుల మీడియా చైర్మన్ గా జీవన్ రెడ్డి ని ఎన్నుకొని నియామక పత్రాలు అందజేశారు ఈ సమావేశంలో రాష్ట్ర కార్మిక విభాగం చైర్మన్ టి ఓబులేసు, రాయలసీమ మీడియా విభాగం చైర్మన్ జి రాఘవ, రాయలసీమ రీజనల్ వైస్ చైర్మన్ ఎన్ సురేష్ బాబు, జిల్లా మైనార్టీ విభాగం చైర్మన్ జాకీర్ బాషా, జిల్లా మైనార్టీ విభాగం చైర్మన్ గౌస్ మొహియుద్దీన్, పలువురు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author