గ్రామాల్లో ప్రధమ చికిత్స కొనసాగించే విధంగా చూడాలి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఈ రోజు ఎంపీ కార్యాలయంలో ఎంపీని కలసిన RMP – PMP నాయకులు ఎంపీ కి కృతజ్ఞతలు తెలిపారు .రాష్ట్రంలో ఉన్న సుమారు 50 వేల మంది RMP – PMP ల ట్రైనింగు క్లాసులు పునరుద్ధరించుట గురించి ముఖ్యమంత్రి కి మరియు రాష్ట్ర ఆరోగ్య శాఖ దృష్టికి తీసుకెళ్లారని RMP – PMP గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్నామని తెలిపారనీ నాయకులు ఎంపికి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆరోగ్యశాఖ సెక్రెటరీ దృష్టికి గ్రామాల్లో RMP – PMP ప్రథమ చికిత్స చేస్తున్నారు అని వీరికి తీసుకెళ్లడం జరిగింది. గతంలో ట్రైనింగు క్లాసులు ఇచ్చారు మరి వాటిని పునరుద్దించాలని ట్రైనింగ్ తో పాటు సర్టిఫికెట్ మంజూరు చేసి గ్రామాల్లో ప్రధమ చికిత్స కొనసాగించే విధంగా చూడాలని ముఖ్యమంత్రిని ఆరోగ్య శాఖ వారిని కోరడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రాధాకృష్ణయ్య రాష్ట్ర నాయకులు దస్తగిరి ఇల్లూరు నరసింహ రఘునాథ్ రెడ్డి ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.