వృద్ధులను కాపాడుకోవాలి
1 min read– ఎన్డబ్ల్యూపీ జిల్లా అధ్యక్షురాలు ఎస్.హసీనాబేగం
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: పిల్లల భవిష్యత్ కోసం నిరంతరం తాపత్రయ పడే వృద్ధులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని నేషనల్ ఉమెన్స్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎస్. హసీనాబేగం అన్నారు. వృద్ధుల మేధస్సు, దూరదృష్టి తదితర అంశాలను భావితరం పరిగణలోకి తీసుకొని.. జీవితాన్ని చక్కదిద్దుకోవాలన్నారు. బుధవారం ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవం సందర్భంగా ఎన్డబ్ల్యూపీ నేతృత్వంలో 50 మంది వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. సమస్య ఏదీ ఉన్నా.. తమను సంప్రదిస్తే వెంటనే పరిష్కరిస్తామని వృద్ధులకు ఎన్డబ్ల్యూపీ జిల్లా అధ్యక్షురాలు హసీనాబేగం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నేషనల్ ఉమెన్స్ పార్టీ ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ ఎన్.మేరీ, శ్రీరామ్ నగర్ ఇంచార్జ్ విజయమ్మ, ఎస్ సుజాత, తాండ్రపాడు గ్రామ ఇంచార్జ్ సుజాత, పి ఆర్ ఓ సురేఖ తదితరులు పాల్గొన్నారు.