హిందూ ముస్లిం ల సామరస్యం సాయినాథ్ శర్మ లక్ష్యం
1 min readపల్లెవెలుగు వెబ్ కమలాపురం: కమలాపురం మండలం పెద్దచెప్పలి లో ఒకేరోజు అయ్యప్ప వార్షికోత్సవ గ్రామోత్సవం ఖాదర్ వల్లి ఉరుసు ఉత్సవాలు జరగడం విశేషం.కమలాపురం నియోజకవర్గ ప్రజా నాయకుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ అటు ఖాదరవల్లి ఉరుసు ఉత్సవంలోనూ అయ్యప్ప స్వామి వార్షికోత్సవం లోను కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు పాల్గొని మతసామరస్యాన్ని పెంచే పూజలు నిర్వహించారు. గ్రామంలో అయ్యప్ప స్వామి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు గురుస్వామి బలరాం ఆధ్వర్యంలో సాయినాథ శర్మను కలిసి ఉత్సవానికి తగిన సహాయం చేయాలని కోరడంతో 30 వేల రూపాయలు అయ్యప్ప ఉత్సవ సేవకు కమిటీ సభ్యులకు అందించారు. అలాగే గ్రామంలో కొత్తగాఇదే రోజు ఖాదరవల్లి దర్గాలో ఉరుసు ఉత్సవం నిర్వహిస్తున్నట్లు ఉరుసు ఉత్సవానికి సహకారమందించాలని దర్గా కమిటీ సభ్యులు సాయినాథ్ శర్మను కోరడంతో దర్గా ఉరుస ఉత్సవాల కోసం 20 వేల రూపాయలు ఈ సభ్యులకు అందించారు. ఈ మేరకు ఆయా కమిటీ సభ్యులు ఆహ్వానం చేయడంతో సాయినాథ్ శర్మ గ్రామంలోని తన వర్గయులందరితో రెండు ఉత్సవాలలో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని సూచించడంతోపాటు తాను కూడా ఖాదరవల్లి దర్గా లో ప్రార్థన చేసి అనంతరం అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లి భక్తిశ్రద్ధలతో తన అనుచరులు సన్నిహితులతో కలిసిపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయినాథ్ శర్మ మాట్లాడుతూ గ్రామంలో ఒకేరోజు హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీకగా ఉరుసు ఉత్సవం అయ్యప్ప గ్రామోత్సవం నిర్వహించడం శుభ పరిణామమన్నారు. గ్రామస్తులందరూ రెండు ఉత్సవాలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం చూస్తుంటే పెద్ద చెప్పాలి గ్రామం మతసామరస్యానికి ప్రత్యేకంగా నిలుస్తోందన్నారు. ఉత్సవాలకు విచ్చేసిన సాయినాథ్ శర్మకు ఆయా కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు అనంతరం కమిటీ సభ్యులు ఘనంగా సాయినాథ్ శర్మ ను సత్కరించారు. సాయినాథ్ శర్మ వెంట పెద్దచెప్పల్లి కొండాయపల్లె ఎంపీటీసీ మెంబర్ నాగరాజా చారి గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ హరితాసుధాకర్ మైనారిటీ నాయకులు మహమ్మద్ రఫీ , గౌస్ఆజాం గ్రామ మాజీ ఎంపీటీసీ నరసింహులు కాపు సంఘం నాయకులు అనకాల రమేష్ సాయినాథ్ శర్మ అభిమాన సంఘ నాయకులు నామాల రాజా రమేష్ ఏసు రత్నం చిరంజీవి సుబ్బారాయుడు శ్రీనివాసులు లక్ష్మయ్య మైనారిటీ నాయకులు మహారాజ్, హస్సన్ మాబాష అబ్దుల్ హైదర్ వల్లి వార్డ్ మెంబర్ కరిమూన్ బిసి నాయకులు రాచవారి పల్లి రమణ తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌస్ ఆజం ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలను సాయినాథ్ శర్మ ప్రారంభించారు.