గురుకులం విద్యార్థులకు 20 వేలు అందించిన కలెక్టర్
1 min read
నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా జుపాడు బంగ్లా మండల కేంద్రంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులను నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజ కుమారి మరియు నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి పి జనార్దన్ రెడ్డి అభినందించారు.సోమవారం నంద్యాల జిల్లా కేంద్రంలోని ఏ ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో జూపాడు బంగ్లా గురుకుల పాఠశాల విద్యార్థులు టిఆర్ జగదీష్ మరియు కే రవితేజ పదవ తరగతి ఫలితాల్లో మంచి ప్రతిభ కనబరిచినందుకు గాను విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డులను కలెక్టర్ అందజేశారు.విద్యార్థులకు మెడల్,సర్టిఫికెట్లు మరియు 20 వేల రూపాయల చెక్కును కలెక్టర్ విద్యార్థులకు అందజేశారు.గురుకుల పాఠశాలలో మంచి మార్కులతో ప్రతిభ కనబరచడం మంచి శుభ పరిణామం అని మీరు మంచిగా చదువుకొని అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. సత్య నారాయణ మూర్తి మరియు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.