డోన్ లో… 13న గొర్రెల… మేకల పెంపకo దారుల రాష్ట్ర సదస్సు
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఈ నెల 13న డోన్ పట్టణంలో తలపెట్టిన గొర్రెల మేకల పెంపకం దారుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని చేతి వృత్తిదారుల సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం కారన్న పిలుపు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో వ్యవసాయానికి అనుబంధంగా ఉంటూ ప్రజలకు పౌష్టిక హారం అందించే ఉత్పత్తి రంగంలో రెండు కోట్ల 21 లక్షల గొర్రెల మేకల పెంపకం అనేక సహకార సంఘాలు కలిగి ఉన్న నాలుగు లక్షల మంది గొర్రెల మేకల పెంపకదారులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయడం లేదని అన్నారు. అందుకే ప్రభుత్వంపై ఈ సమస్యల పరిష్కారం ఒత్తిడి తీసుకొని రావడానికి డిసెంబర్ 13న డోన్ పట్టణంలో జరిగే గొర్రెల మేకల పెంపకదారిలో రాష్ట్ర సదస్సు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని చేతి వృత్తిదారుల సమైక్య జిల్లా కార్యదర్శి ఎం కారన్న తో పాటు రైస్ సంఘం పత్తికొండ నియోజకవర్గం సమితి అధ్యక్షులు పెద్ద వీరన్న రైతు సంఘం ఆలూరు కార్యదర్శి నాగేంద్రయ్య తదితరులు సదస్సులో పాల్గొంటారని ఆయన తెలిపారు.