PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

70 వ వార్షికోత్సవ వేడుకల బ్రోచర్ విడుదల..   

1 min read

ముఖ్య అతిథులుగా హోమ్ మినిస్టర్స్ తానేటి వనిత, ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని, ఎంపీ కోటగిరి శ్రీధర్, చంద్రియన్ త్రీ ఇస్రో శాస్త్రవేత్త కల్పన కళాహస్తిఘనంగా నిర్వహించనున్న వార్షికోత్సవ, క్రిస్మస్ వేడుకలు ఈ వేడుకలకు అతిథులుగా మనదేశంలో వివిధ రాష్ట్రాల్లో  ఐఏఎస్, ఐపీఎస్ గా వివిధ హోదాల్లో పనిచేస్తున్న కళాశాలల పూర్వ విద్యార్థులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : సెయింట్ థెరీసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాల ప్రారంభించి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈనెల 15,16వ తేదీలలో వేడుకలు జరగనున్నాయని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి మెర్సి తెలిపారు. వివరాల్లోకి వెళ్తే ఏలూరులో స్థానిక శనివారం పేటలో ఉన్న తెరిసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కరస్పాండెంట్ సిస్టర్ ఎర్నిస్తిన్ ఫెర్మెండిస్ట్ మాట్లాడుతూ 1953 వ సంవత్సరంలో  ఈ కళాశాలను మహిళలు చదువుతోపాటు మంచి భవిష్యత్తును అందించాలనే దృక్పథంతో ప్రారంభించగా ఈనాటికి 70 సంవత్సరాలు పూర్తయిందని. 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రెండు రోజులపాటు70వ వార్షికోత్సవ క్రిస్మస్ వేడుకలు కూడా నిర్వహించడం జరుగుతుందని. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు నుండి వేడుకలు ప్రారంభవుతాయని. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మా కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు తానేటి వనిత, ,చంద్రియన్ త్రీ ఇస్రో శాస్త్రవేత్త కల్పన కళహస్తి, అదేవిధంగా ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని, ఎంపీ కోటగిరి శ్రీధర్, ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, తోపాటు మన దేశంలో పలు రాష్ట్రాలలో  ఐఏఎస్ ,ఐపీఎస్ వివిధ హోదాలలో పనిచేస్తున్న పూర్వ విద్యార్థులు పాల్గొంటారని. ఈ వేడుకల్లో ప్రత్యేకంగా ప్రస్తుతం మా కళాశాలలో చదువుతున్న విద్యార్థులు పలు సంస్కృత కార్యక్రమాలతో పాటు కళాశాల స్థాపిత కథనం  ద్వారా కళాశాలను ఏ విధంగా స్థాపించారు అనే విషయాన్ని విద్యార్థులు చూపిస్తారని. ఈ రెండు రోజులు పాటు 70వ వార్షికోత్సవ  క్రిస్మస్ వేడుకలు కూడా ఘనంగా  జరుగుతాయని కావున పూర్వ విద్యార్థులు వారి తల్లిదండ్రులు విచ్చేసి ఈ వేడుకల్లో పాలుపంచుకోవాల్సిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి .మెర్సీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నియసీమ, ప్రొఫెసర్ సిహెచ్ .వి .మహాలక్ష్మి, దుర్గా వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.

About Author