రాఘవేంద్రుని సన్నిధిలో కర్నాటక మంత్రి కె.హెచ్.మునియప్ప
1 min readపల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శించుకునేందుకు కర్నాటక రాష్ట్ర ఆహార మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి కె.హెచ్.మునియప్ప కుటుంబ సమేతంగా ఆదివారం వచ్చారు .వీరికి శ్రీ మఠం ధార్మిక అధికారి శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ పీఆర్వో హోన్నళ్ళి వ్యాసరాజ్ స్వామి వార్లు శ్రీ మఠం సాంప్రదాయ బద్దంగా స్వాగతం పలికారు. వీరు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ ను దర్శించుకొని కుంకుమ అర్చన,మహా మంగళ హారతి ఇచ్చారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకొని మొక్కులు తీర్చుకొని విశేష పూజలు నిర్వహించారు. తదనంతరం శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామి శ్రీ రాఘవేంద్ర స్వామి మెమెంటో, శేష వస్త్రాం, పుష్ప, ఫల మంత్రాక్షీతలు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ద్వారపాలక ప్రకాశ్ స్వామి, హెడ్ కానిస్టేబుల్ ఆనంద్ రెడ్డి, కానిస్టేబుల్ రంగస్వామి, కర్నాటక రాష్ట్ర పోలీసులు తదితరులు పాల్గొన్నారు.