NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ట్విట్టర్ కు పోలీస్ నోటీసులు ..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ట్విట్టర్ భార‌త విభాగానికి ఎండీగా ఉన్న మ‌నీషా మ‌హేశ్వరికీ యూపీ పోలీసులు నోటీసులు పంపారు. మ‌త విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొంద‌రు ట్విట్టర్ ను ఉప‌యోగించుకున్నార‌ని, దీని మీద వారం రోజుల్లో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరారు. ఈ వివ‌ర‌ణ‌ను లోనీ బోర్డర్ పోలీస్ స్టేష‌న్ లో రికార్డు చేయాల‌ని సూచించారు. స‌మాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొంత మంది ట్విట్టర్ ను ఉప‌యోగించుకున్నార‌ని, వారి మీద ట్విట్టర్ యాజ‌మాన్యంగానీ.. దాని భార‌త విభాగం కానీ ఎలాంటి చ‌ర్యలు తీసుకోలేద‌ని పోలీసు నోటీసుల్లో పేర్కొన్నారు. ఫ‌లితంగా స‌మాజంలో విద్వేషాలు పెరిగేందుకు ఆస్కారం ఉంద‌ని అందులో పేర్కొన్నారు. పోలీసులు ట్విట్టర్ లో విద్వేష‌పూరిత మెసేజ్ పంపిన 8 మంది మీద ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. అందులో ట్విట్వర్ పేరు కూడ ఉంది.

About Author