NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విశాఖ ఉక్కులో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధులలోకి తీసుకోవాలి

1 min read

కార్మిక సంఘాల ప్రదర్శన ధర్నా.

ఎమ్మిగనూరు న్యూస్ నేడు:  ఎమ్మిగనూరు పట్టణంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో అన్యాయంగా తొలగించిన 2500 మంది కాంట్రాక్ట్ కార్మికులను విధులలోకి తీసుకోవాలని,8 నెలలుగా పెండింగ్ లో ఉన్న కార్మికుల వేతనాలు చెల్లించాలని, నిర్బంధంతో  కార్మికుల సమ్మెను భగ్నం చేయాల నే ఆలోచనను యాజమాన్యం ప్రభుత్వం మానుకోవాలనే  ప్రధాన డిమాండ్లతో రాష్ట్ర కేంద్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు ఎమ్మిగనూరు లో ఏఐటీయూసీ, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో పాత మున్సిపల్ కార్యాలయం నుండి  సోమప్ప సర్కిల్ వరకు ప్రదర్శన నిర్వహించి ధర్నా చేయడం జరిగిందనీ  ఏఐటీయూసీ తాలూకా అధ్యక్ష కార్యదర్శులు వీరేష్, తిమ్మ గురుడు  ఐఎఫ్టియు నాయకులు రాజు, ప్రసాద్  మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కు పరిశ్రమ ను ఆదుకోవడంలో విఫలం చెందారని వారు విమర్శించారు. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయమని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కు అప్పజెప్పి విశాఖ ఉక్కు పరిశ్రమ ఉత్పత్తికి, అభివృద్ధికి సహాయం చేస్తామని కేంద్ర స్టీలు పరిశ్రమ ల  శాఖ మంత్రి కుమారస్వామి చెప్పినట్టే చెప్పి దొడ్డిదా రిలో విశాఖను ప్రైవేటు పరం చేయడానికి కుట్రలుపన్నుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో తొలగించిన 2,500 మంది కాంట్రాక్టు  కార్మికులను తక్షణమే విధులకు తీసుకోవాలని, విశాఖకు ఫ్యాక్టరీకి సొంత గనులు  కేటాయించాలని, సమ్మె చేస్తున్నటువంటి కార్మికులపై పోలీసుల వేధింపులను ఆపాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పరం చేయించమని వాగ్దానాలు చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొత్తగా ఏర్పాటు చేస్తున్న మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ కి  సొంతగనుల కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నారే గాని విశాఖ ఉక్కు కు సొంత గనులు  కేటాయించాలని ఎందుకు అడగడం లేదని వారు ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని  ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ప్రైవేటుకరణ ఆపేంతవరకు పోరాటం చేస్తామని వారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి విజేంద్ర, పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి మహేంద్ర బాబు,ఏఐటీయూసి, ఐఎఫ్టియు నాయకులు దాదావలి, సమీవుల్లా,  మల్లికార్జున్ గౌడ్, సుంకన్న, నరసింహులు, ఏసోబు,నాగరాజు,ఆగస్టున్ కిరణ్,నరసన్న,నల్లన్న,శాంతి రాజు,మోహన్, తదితరులు పాల్గొన్నారు.

About Author