NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముగిసిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ క్రీడలు

1 min read

బహుమతులను అందజేసిన బత్తిని లోకనాథ్   

పత్తికొండ, న్యూస్​ నేడు:  పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 45 రోజుల పాటు సాగిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ వాలీబాల్ క్రీడలు సోమవారం నాడు ముగిసాయి. వాలీబాల్ క్రీడలలో పాల్గొన్న క్రీడాకారులకు తెలుగు యువత అధికార ప్రతినిధి బత్తిన లోకనాథ్ బహుమతులను అందజేశారు.శాప్ జిల్లా ప్రాదికార సంస్థ సౌజన్యంతో సమ్మర్ కోచింగ్ క్యాంప్ వాలీబాల్ క్రీడలు స్థానిక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మైదానంలో వాలీబాల్ క్రీడలు మే ఒకటో తేదీ నుండి జూన్ 9వరకు 8 సంవత్సరాల బాలబాలికలు 16 సంవత్సరాల లోపు క్రీడాకారులు వాలీబాల్ లో శిక్షణ పొందారు. ఈ శిక్షణ శిక్షణ శిబిరంలో 50 మంది బాల, బాలికలు శిక్షణ తీసుకున్నారు. ఈ శిక్షణ శిక్షణ శిబిరము ముగింపు కార్యక్రమమునకు రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి శ్రీ బత్తిని లోకనాథ్  జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం సెక్రటరీ ఎస్ . చందు నాయక్, వాలీబాల్ కోచ్ రామాంజనేయులు, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వోకేషనల్ లెక్చరర్ ఎం రామ్మోహన్, వీఆర్వో విద్యాసాగర్ రెడ్డి,  జై భారత్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు పి జయ ప్రకాష్, సెక్రటరీ రుకేష్, రవితేజ, అడ్వకేట్ సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు పి. జయ కృష్ణ,  సాయి కుమార్, లక్ష్మణ్, ఎం రాజేష్ శిక్షణ పొందిన క్రీడాకారులకు  సర్టిఫికెట్స్ తో పాటు బహుమతులు అందజేశారు.

About Author