డాక్టర్ మాబు మృతి పేద ప్రజల కి తీరని లోటు
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: తుగ్గలి మండల పరిధిలోని పెండేకల్ రైల్వే జంక్షన్ లో గత 50 సంవత్సరాల నుండి ఆర్.ఎం.పి డాక్టర్ గా ప్రజలకు సేవలు అందిస్తున్న డాక్టర్ మాబు(75) అనారోగ్యముతో ఆదివారము కర్నూలు పట్టణంలో ని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, మృతి చెందారు. ఈయన మృతి పట్ల పలు గ్రామాల ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గత 50 సంవత్సరాల నుండి పెండేకల్లు ఆర్ఎస్ కేంద్రంగా ప్రవేట్ ఆసుపత్రి నిర్వహిస్తూ అనేకమంది పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ ప్రజలలో మంచి డాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. డాక్టర్ మాబు మృతి విషయం తెలుసుకున్న ప్రజలు పెండేకల్ రైల్వే జంక్షన్ కు తరలివచ్చి ఆయన మృతదేహం పై పూలమాలలు వేసి నివాళులు అర్పించి సంతాపం తెలియజేశారు. మారెళ్ళ అశోక సహకార సంఘం అధ్యక్షులు అట్లా గోపాల్ రెడ్డి, పెండేకల్ గ్రామ సచివాలయ కన్వీనర్ అట్లా బసిరెడ్డి, రామకొండ సర్పంచ్ గౌరవ సలహాదారుడు పటేల్ సుధాకర్ రెడ్డిలు ఆయన మృతి దేహం పై పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 50 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఆర్ఎంపీ డాక్టర్ గా పనిచేస్తూ ఎంతోమంది పేద ప్రజలకు వైద్య సేవలు అందించి ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ మాబు మృతి తీవ్ర ఆవేదనాన్ని కలిగిస్తుందని వారు అన్నారు. ఆయన ఆత్మకు దేవుడు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నట్లు వారు తెలిపారు.