తొలి గోల్డ్ మెడల్ సాధించిన మిల్కా సింగ్ ఇకలేరు !
1 min readపల్లెవెలుగు వెబ్: ప్రముఖ క్రీడాకారుడు మిల్కా సింగ్ కన్ను మూశారు. కరోన బారిన పడ్డ ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పాకిస్థాన్ లో ఉన్న పంజాబ్ లో ఆయన జన్మించారు. భారత క్రీడా ఆణిముత్యంగా కీర్తి గడించారు. పరుగల పోటీల్లో అరుదైన రికార్డులు నెలకొల్పారు. 1958 జాతీయ క్రీడల్లో రెండు స్వర్ణపతకాలు గెలుపొందారు. 1958 బ్రిటిష్ ప్రభుత్వం , కామన్వెల్త్ క్రీడల్లో అరుదైన ఘటన సాధించారు. 46.6 సెకెన్లలో 440 యార్డ్స్ పరిగెత్తిన మిల్కాసింగ్.. భారత్ తరపున తొలి స్వర్ణం గెలుచుకున్న క్రీడాకారుడిగా గుర్తింపు పొందారు. 1959లో కేంద్ర ప్రభుత్వం మిల్కా సింగ్ కు పద్మశ్రీ బిరుదు ప్రధానం చేసింది. ఆయన జీవితం ఆధారంగా బాలీవుడ్ లో బాగ్ మిల్కా బాగ్ పేరుతో ఓ చిత్రం కూడ నిర్మితమైంది.