గూగుల్లో ఇవి వెతకొద్దు..
1 min readచేతిలోకి ఆండ్రాయిడ్ మొబైల్ వచ్చాక మనుషులు మాట్లాడుకోవడం మానేశారు. మొబైల్ తోనే మాట్లాడుతున్నారు. చాటింగ్ లు , వాచింగ్ లతో సగం సమయం గడిపేస్తున్నారు. ఏ డౌట్ వచ్చినా సరే… గూగుల్ లో వెతికేస్తున్నారు. సర్వరోగనివారిణిలాగ… ఏ సమాచారం కావాలన్నా… సమస్యకు పరిష్కారం కావాలన్నా సరే గూగుల్ నే ఆశ్రయిస్తున్నారు. దీంతో మనకు తెలియకుండానే…స్కామర్ల ట్రాప్ లో పడిపోతున్నాము. హ్యాకర్లు, స్కామర్లు , దొంగలు, దగుల్బాజీలందరూ ఇప్పుడు టెక్నాలజీని తమ దోపిడీకి మార్గంగా మార్చుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే.. గూగుల్ కేవలం మనకి సమాచారం మాత్రమే ఇస్తుంది. కానీ సమస్యకు పరిష్కారం కాదు. తెల్లగుండేవన్ని పాలు కాదు అన్నట్టు… గూగుల్లో దొరికే సమాచారమంతా నిజం కాదన్న విషయం మరిచిపోకూడదు. రోగాలకు మందులు వెతకడం మంచి పద్దతి కాదు. రోగలక్షణాలను సెర్చ్ చేసి…సొంత వైద్యం చేసుకోవడం మంచిదికాదు. అలాగే ఆర్థిక వివరాల గురించి ఇతరలకు సమాచారం ఇవ్వడం.. గూగుల్ ఆర్థిక వివరాలకు సంబంధించిన సమాచారం కోసం వెతకడం, ఓటీపీలు, సీక్రె ట్ కోడ్ లు ఎంటర్ చేయడం వంటివి చేయకూడదు. అనవరమైన అప్లికేషన్లు డౌన్ లోడ్ చేసుకోవడం, యూఆర్ఎల్ లింక్ ను ఆధారంగా చేసుకుని సెర్చ్ చేయడం కూడ మన వివరాల్ని స్కామర్లకు అందిస్తుంది. దీంతో మన డేటా ఆధారంగా మనల్ని స్కామర్లు ఇబ్బందులకు గురి చేస్తారన్న విషయం మరిచిపోకూడదు.