వైయస్ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం..!
1 min readఆలూరు ముఖ్య నాయకుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు కె. బాబురావు..
పల్లెవెలుగు వెబ్ ఆలూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ షర్మిల రెడ్డి గారు కర్నూలు జిల్లా పర్యటన ఈనెల 29వ తేదీన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశానికి తొలిసారిగా జిల్లాకు వస్తున్న సందర్భంగా ఈరోజు ఆలూరు పట్టణం నందు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు *కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఆలూరు అసెంబ్లీ సమన్వయ కమిటీ సభ్యులు చిప్పగిరి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షులు *కె బాబురావు ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి వైయస్ షర్మిల రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని, కాంగ్రెస్ పార్టీతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ఆలూరు అసెంబ్లీ సమన్వయ కమిటీ సభ్యులు చిప్పగిరి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వైఎస్సార్ ఆశయాలు షర్మిలమ్మ తోనే సాధ్యమని స్వర్గీయ వైయస్ఆర్ గారి కోరిక రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్న కోరికను షర్మిలమ్మ తీరుస్తారని, ఆలూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని వైయస్ షర్మిలకి ఘన స్వాగతం పలికి సభను విజయవంతం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మూలింటి మారెప్ప, INTUC జిల్లా అధ్యక్షులు బతుకన్న, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు లాజరస్, ఓబీసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరాముడు, పత్తికోండ క్రాంతి నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఖాజావుద్దీన్, ఎస్సీ సెల్ తాలుకా అధ్యక్షులు లింగంపల్లి రామాంజనేయులు, ఉపాధ్యక్షులు ఈరన్న, ఆలూరు మండల అధ్యక్షులు తుంబలబీడు లక్ష్మన్న, దేవనకోండ మండల అధ్యక్షులు నేలతలమర్రి వెంకప్ప, చిప్పగిరి మండల అధ్యక్షులు డేగులపాడు మంజునాథ్, హలహర్వి మండల అధ్యక్షులు పరదయ్య స్వామి, సీనియర్ నాయకులు కరెంటు గోవిందు, చిప్పగిరి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ఖాజీపురం రాంబాబు, హలహర్వి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు విజయ్ కుమార్, ఆలూరు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు వరకుమార్, దేవనకోండ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బోనాల బాలకృష్ణ, ఆస్పరి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు లక్ష్మన్న, ఆలూరు తాలూకా యూత్ కాంగ్రెస్ నాయకులు చిప్పగిరి వినోద్ కుమార్, హులేబీడు సంజప్ప, ప్రధాన కార్యదర్శి నగరడోణ శ్రీరాములు పాల్గొన్నారు.