ఉపయోగం లేని చెక్కుబుక్కులు.. స్టాంపులు దహనం..
1 min readప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికారుల సమక్షంలో..
ఏలూరు జిల్లా ఖజానా కార్యాలయ ఆవరణలో ఉపయోగo లో లేని 3420 చెక్కుబుక్కులు,16,12,985-
O6 విలువైన వివిధ రకాల స్టాంపులు దహనం..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ప్రభుత్వ ఆదేశాలమేరకు మంగళవారము ఏలూరు జిల్లా పరిధిలోని ఎనిమిది ఉప ఖజానా కార్యాలయములు మరియు జిల్లా ఖజానా కార్యాలయము లకు సంభందించిన ఉపయోగములో లేని 3420 చెక్కు బుక్కులు మరియు రూ. 16,12,985=60 విలువైన వివిధ రకముల స్టాంపులు జిల్లా ఖజానా కార్యాలయము ఆవరణలో ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ వారి ఆదేశముల మేరకు జిల్లా రెవిన్యూ అధికారి యం. వెంకటేశ్వర్లు నేతృత్వంలో జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ కార్య నిర్వహణ అధికారి, డిప్యుటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు మరియు ఏలూరు జిల్లా ఖజానా అధికారుల సమక్షములో దహనము చేయడము జరిగిందని జిల్లా ఖజానాధికారి టి. కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమములో ఏలూరు జిల్లాలోని ఉపఖజానా అధికారులు మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భముగా జిల్లా ఖజానా అధికారి టి. కృష్ణ మాట్లాడుతూ జి. ఓ. నెంబర్ 135 ప్రకారము గత చాల కాలముగా ఉపయోగములో లేని వివిధ రకముల స్టాంపులు మరియు చెక్కు బుక్కులు దహనము చేయమని ప్రభుత్వము వారు ఆదేశములు జారీచేసినారు. ఈ జి. ఓ. ప్రకారము ప్రభుత్వము జిల్లా జాయింట్ కలెక్టర్ వారి ఆధ్వర్యములో పదిమంది జిల్లా స్థాయి అధికారులతో ఒక కమిటిని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కమిటి యొక్క ఆదేశము ప్రకారము ఈరోజు ఉపయోగములో లేని చెక్కు బుక్కులు మరియు వివిధ రకముల స్టాంపులు జిల్లా ఖజానా కార్యాలయము ఆవరణలో దహనము చేయడము జరిగిందని ఆయన తెలిపారు.