విద్యార్థుల పాలిట శాపంగా… మండల జిల్లా విద్యాశాఖ అధికారులు
1 min readపల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల, : జీనియస్ గ్లోబల్ స్కూల్ ని సీజ్ చేయాలని డీఈవో చిత్రపటాలు దహనం చేయడం జరిగింది. ఆర్ యు ఎస్ ఎఫ్, ఆర్ పి ఎస్ ఎఫ్ఎమ్మిగనూరు పల్లెవెలుగు న్యూస్ గోనెగండ్ల మండలంలో ఆర్పీ ఎస్ ఎఫ్, ఆర్ యూ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో రోడ్డుపైన ధర్నా నిర్వహించి డీఈవో చిత్రపటాలను దహనం చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఆర్ పి ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆఫ్రిది ఆర్ యు ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ మాట్లాడుతూ జీనియస్ గ్లోబల్ స్కూల్ పెట్రోల్ బంక్ పక్కన ఉంది అని ఈ స్కూల్ ని సీజ్ చేసి , దీని డెమోలసిస్ చేయాలని జిల్లా మండల విద్యాశాఖ అధికారులకు, జిల్లా విద్యాశాఖ అధికారులకు ఎంత విన్నవించుకున్నా కూడా విద్యార్థుల ప్రాణాల పట్ల ఎటువంటి శ్రద్ధ చూపించకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారు కావున దీనిని బట్టి చూస్తే మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు ఏదో ముడుపులు పుచ్చుకున్నట్లు అర్ధమవుతుంది . ఎన్ని వినతి పత్రాలు ఇచ్చిన, ఎన్ని ధర్నాలు చేసినా కూడా విద్యాశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతునారు అని అన్నారు. ఇప్పటికి అయేనా జిల్లా విద్య అధికారులు స్పందించి పాఠశాలకు అనుమతులు ఇచ్చిన ఏం ఈ ఓ వినోద్ కుమార్ చర్యలు తీసుకొని విధులు నుంచి తొలిగించాలి అని వారు. లేని పక్షంలో ఆర్ జె డి కీ ఫిర్యాదు చేస్తము అని అన్నారు. ఈ కార్యక్రమం లో నాయకులు భారత్, వీరేష్, ప్రసాద్, నాయుడు, బాలు తదితరులు పాల్గొన్నారు.