సీఎం సహాయనిధి కింద రూ. 8లక్షల 92 వేలు మంజూరు ..
1 min readనియోజకవర్గ ఇన్చార్జి బుట్టా రేణుక వెల్లడి
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు ఎమ్మెల్యే “ఎర్రకోట చెన్నకేశవరెడ్డి” ఆదేశాల మేరకు నియోజకవర్గంలో సీఎం సహాయనిధి కింద రూ. 8,92,000/- లక్షల చెక్కులు మంజూరైనట్లు మన ప్రియతమ నాయకురాలు, ఎమ్మిగనూరు సమన్వయకర్త శ్రీమతి “బుట్టా రేణుక” తెలిపారు. శనివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయం నందు లబ్ధిదారులకు చెక్కులను మన ప్రియతమ నాయకురాలు, ఎమ్మిగనూరు సమన్వయకర్త శ్రీమతి “బుట్టా రేణుక” చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. లబ్దిదారుల పేర్లు మీతుకుల సత్యన్న రూ. 60,000/- (కోటేకల్), గొల్ల బాలనాగమ్మ రూ. 130,000/- (ఎమ్మిగనూరు), పెబ్బిటి హేమలత రూ. 1,50,000/- (ఎమ్మిగనూరు), బోయ పద్మావతి రూ. 24,000/- (ఎమ్మిగనూరు), మోనే కమలమ్మ రూ. 70,000/-(నాగలదిన్నె), కుమ్మరి ఈశ్వరమ్మా రూ. 32,000/-(మూగతి), తెలుగు నరసింహుడు రూ. 65,000/-(పార్లపల్లె), రెడ్డి వాండ్ల కృష్ణవేణి రూ. 34,000/-(ఎమ్మిగనూరు), కురువ మాదన్న రూ. 90,000/-(ఎమ్మిగనూరు), మంగలి రామాంజిని రూ. 70,000/-(కోటేకల్), కనికే గణేష్ రూ. 42,000/-(ఎమ్మిగనూరు), ఎరుకుల రాధమ్మ రూ. 45,000/-(కనికివీడు), బోయ రాజు రూ. 80,000/-(కడిమెట్ల) తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ నియోజకవర్గంలోని అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొంది సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నట్లు స్థానిక ఎమ్మెల్యే “ఎర్రకోట చెన్నకేశవరెడ్డి” దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది. దీంతో ఆయన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలసి సమస్యను ఆయన దృష్టికి తీసుకునివెళ్లగా వెంటనే చెక్కులు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల & పట్టణ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.