భక్తిశ్రద్ధలతో దుర్గ భోగేశ్వర స్వామి రథోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: శివరాత్రి మహోత్సవాలలో భాగంగా దుర్గ భోగేశ్వర స్వామి రథోత్సవం ఆదివారం నాడు భక్తుల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు దుర్గా సమేత బోగేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను రథంలో ఉంచి ఊరేగింపు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని రథోత్సవం కార్యక్రమాన్ని తిలకించారు. కాలభైరవ వేషధారణలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, గడిగరేవుల గ్రామానికి చెందిన చెక్క భజన బృందం వారిచే కోలాటం కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు,ఆలయ కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు శ్యామ్ సుందర్ శర్మ, గిరిధర్ శర్మ, విజయ్ శర్మ ల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రథాన్ని భక్తిశ్రద్ధలతో, ఓంకార నాదం తో పెద్ద ఎత్తున భక్తులు లాగారు. దీంతో 9వ తేదీ నుండి మొదలైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రథోత్సవం కార్యక్రమంతో ముగిసాయి .ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గడివేముల ఎస్సై బీ టీ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈ ఓ చంద్రశేఖర్ రెడ్డి, ఆలయ చైర్మన్ ఐసాని సునీల్ కుమార్ రెడ్డి ధర్మకర్తలు ,సిబ్బంది రమణ తదితరులు పాల్గొన్నారు.