జాబ్ లెస్ క్యాలెండర్ ను రద్దు చేయాలి..
1 min readపల్లెవెలుగు వెబ్, రాయచోటి: నిరుద్యోగుల ఆశలను నీరుకార్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాబ్ లెస్ క్యాలెండర్ ను వెంటనే రద్దు చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ జక్కల వెంకటేష్, ఏఐఎస్ఎఫ్ రాయచోటి ఏరియా అధ్యక్షులు తుమ్మల లవ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం పదివేల 143 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసిందని, నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లే విధంగా ఉన్న ఆ జాబ్ లేస్ క్యాలెండర్ ను రద్దు చేసి నూతన జాబ్ క్యాలెండర్ ను ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి రాక ముందు రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2 లక్షల 30 వేల పోస్టులను భర్తీ చేస్తామన్న అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఉద్యోగాలు ఊసే ఎత్తకుండా కేవలం 10 వేల 143 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ విప్లవం సృష్టిస్తున్నామని గొప్పలు చెప్పడం సరైన పద్ధతి కాదన్నారు.