ఏ.పి.రామయ్య యాదవ్ నే గెలిపించుకుందాం…
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఇంతకు మునుపు ఉన్నవాళ్లు కావచ్చు, ప్రస్తుతం ఉన్న వాళ్లు కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు అందరిదీ ఒకే వ్యసనమని అది దోచుకోవడం దాచుకోవడమేనని, ఇట్లాంటి వ్యవస్థ మారాలంటే మీలాంటి నాయకుడు స్వచ్ఛందంగా రాజకీయాల్లోకి వచ్చి కుళ్లిపోయిన వ్యవస్థలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, మేము ఏ పార్టీ వారమైనా ఒక లక్ష్యం కోసం పని చేస్తున్న మీకు కచ్చితంగా ఓట్లు వేస్తామని పాలకొట్టాలా, లేబర్ కాలనీలో జరిగిన ప్రజా పలకరింపు యాత్రలో జాతీయ సమ సమాజం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రామయ్య యాదవ్ కు స్వచ్ఛందంగా తమ మద్దతును తెలియజేస్తూ అభినందించారు.