NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెళ్లి చేసుకో… ఉద్యోగం తీసుకో..

1 min read

ఢిల్లీ: పెళ్లి చేసుకుంటావా…. లేదా జైలుకెళ్తావా అంటూ సుప్రీం కోర్టు ఓ కేసులో నిందితుడిని ప్రశ్నించింది. పోక్సో చ‌ట్టం కింది అత్యాచార ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మోహిత్ సుబాష్ చ‌వాన్ బెయిలు కేసు విచార‌ణ సంద‌ర్భంగా ఈ ప్రశ్నలు వేసింది. ‘బాధితురాలిని పెళ్లి చేసుకుంటే.. కేసు తీవ్రత త‌గ్గుతుంది. అలాగే ఉద్యోగం కూడ ఊడ‌దు. మేము కూడ శిక్ష ప‌డ‌కుండా స‌హాయం చేయ‌గ‌లం ’ అంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. పాఠ‌శాల విద్యార్థినిని అత్యాచారం చేసిన కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మోహిత్ చ‌వాన్ ను పై విధంగా కోర్టు ప్రశ్నించింది. అయితే…త‌న‌కు ఇది వ‌ర‌కు వివాహం అయిన నేప‌థ్యంలో తాను ఆమెను వివాహం చేసుకోలేన‌ని మోహిత్ చ‌వాన్ కోర్టుకు విన్నవించాడు. దీంతో రెగ్యుల‌ర్ బెయిల్ కు అప్లై చేసుకోవాల‌ని కోర్టు సూచించింది.

About Author