జగనన్న ప్రభుత్వంలోనే..మంచి పథకాలు
1 min read-ఇంటింటికి వెళ్లడం..నాకు చాలా సంతోషాన్నిస్తుంది
-వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ధారా సుధీర్
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: గత ఐదేళ్ల నుంచి జగనన్న ప్రభుత్వంలో కొన్ని మంచి పథకాలు ఉన్నాయని గ్రామాల్లో ఇంటింటికి వెళ్తూ ప్రజలతో మాట్లాడటం వలన నాకు చాలా సంతోషంగా ఉందని నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ధార సుధీర్ అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని దేవనూరు..సున్నం పల్లి గ్రామాల్లో ఉ.7 నుంచి మ. ఒంటి గంట వరకు గ్రామ నాయకులతో కలిసి డాక్టర్ సుధీర్ ఇంటింటికి తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు మీ ఓటు నన్ను గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.తర్వాత డాక్టర్ సుధీర్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల వల్ల ప్రజలు మంచిగా లబ్ధి పొందారని నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రజలు వైసీపీ పార్టీని బాగా నమ్ముతున్నారు కాబట్టే ఇక్కడ ఎన్నికలు చాలా ఈజీగా ఉందని అన్నారు. ప్రజలు ముఖ్యమంత్రి జగనన్ననే నమ్ముతారే తప్పా ఎన్ని కూటములు ఎన్ని వాగ్దానాలు చేసినా నందికొట్కూరు ప్రజలు నమ్మరని ఆయన అన్నారు.అంతే కాకుండా లోకల్-నాన్ లోకల్ గురించి నేను కామెంట్ చేయనని డాక్టర్ సుధీర్ అన్నారు.డాక్టర్ సుధీర్ సమక్షంలో గ్రామానికి చెందిన చిన్న మౌలా,అన్వర్ భాష, ఆరిఫ్ అలీ,నూరుల్లా,డి నారాయణ,అక్బర్ బాష వీరికి కండువాలు కప్పి వైకాపా పార్టీలోకి ఆహ్వానించారు.గ్రామంలో సిసి రోడ్లు,విద్యుత్ స్తంభాలు కరెంట్ తదితర సమస్యల గురించి ప్రజలు డాక్టర్ సుధీర్ దృష్టికి తీసుకువచ్చారు.అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలను పరిష్కరిస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.సచివాలయానికి వెళితే ఏ పని కావాలన్నా డబ్బులు ఇవ్వనిదే విఆర్ఓ పనులు చేయడం లేదని ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.ఎండను లెక్క చేయకుండా గ్రామ నాయకులు, వైసీపీ మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి లతో కలసి డాక్టర్ సుధీర్ ఉత్సాహంగా ప్రజల వద్దకు వెళుతూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హరిత,ఎంపీటీసీ ఎస్ ఫరీదా, గ్రామ నాయకులు నవాజ్ అలీ, సంకిరెడ్డి,మండల కో ఆప్షన్ సభ్యులు పెద్దమౌలా, షరీఫ్,గుల్జార్, కృష్ణారెడ్డి,రామసిద్ధారెడ్డి, అయ్యన్న,మహబూబ్ బాష,ఏఎంసీ మాజీ చైర్మన్ చిన్న మల్లారెడ్డి సహకార సొసైటీ చైర్మన్ నాగ తులసి రెడ్డి,వైస్ ఎంపీపీ నబి రసూల్ తదితరులు పాల్గొన్నారు.