శేష జీవితం.. ఆనందంగా గడపండి..
1 min read
ఇరిగేషన్ ఎస్.ఈ. ద్వారకనాథ్ రెడ్డి
కర్నూలు, న్యూస్నేడు:ఉద్యోగానికి న్యాయం చేయాలన్న తలంపుతో నిరంతరం ప్రజలకు సేవ చేసే ఉద్యోగులు… శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు ఇరిగేషన్ ఎస్.ఈ. ద్వారకనాథ్ రెడ్డి. శుక్రవారం నగరంలోని ఆర్ ఎస్ సర్కిల్లోని జల వనరుల శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న ఎన్. విజయ భారతి పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆమెకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్.ఈ. ద్వారకనాథ్ రెడ్డి మాట్లాడారు. జల వనరుల శాఖ కార్యాలయంలోనే 38 ఏళ్ల కిందట టైపిస్టుగా విధుల్లో చేరిన విజయ భారతి… అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదుగుతూ సూపరింటెండెంట్ స్థాయికి రావడం అభినందనీయమన్నారు. ఉద్యోగులందరూ తమ పని సక్రమంగా చేసుకుంటూ పోతే… ఉన్నత పదవులు అవంతకవే వస్తాయని, ఇందుకు సూపరింటెండెంట్ విజయ భారతి ఆదర్శమన్నారు. ఆ తరువాత సూపరింటెండెంట్ ఎన్. విజయ భారతి ఉద్యోగులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎస్.ఈ. బాల చంద్రా రెడ్డి, ఎన్.టి.పి.ఏ. మల్లిక, స్టెనోగ్రఫర్ విజయ కుమార్, విజయభారతి భర్త , రిటైర్డు పారా మెడికల్ ఆఫీసర్ కరణం గోపినాథ్ రావు , కొడుకు కరణం షణ్మఖ శ్రీనివాస్, కోడలు స్నేహ తదితరులు పాల్గొన్నారు.