స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం చంద్రబాబుతోనే సుసాధ్యం-చిన్నహ్యట శేషగిరి
1 min read
హొళగుంద, న్యూస్ నేడు: హొళగుంద మండల కేంద్రంలో కూటమి నేతల ఆధ్వర్యంలో నూతనోత్సాహంతో కొనసాగిన ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు చిన్నహ్యట శేషగిరి, మండల కన్వీనర్ టి. తిప్పయ్య, బిజెపి నాయకులు చిదానంద గారందరూ సంయుక్తంగా దేశ చరిత్రలో సువర్ణ పాలనను అందిస్తూ దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రం కూడా అందించని భారీ మొత్తంలో యన్.టి.ఆర్ సామాజిక పెన్షన్లను అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని ఈ ఖ్యాతి, కార్యదక్షత, చరితాత్ముడు మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కే చెల్లుతుందన్నారు.తదనంతరం కూటమి నేతల ఆధ్వర్యంలో యన్.టి.ఆర్ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం హొళగుందలోని స్థానిక బిసి కాలనీ, బుడగజంగం కాలనీ,ఎస్టి కాలనీ తదితర ఏరియాలలో ఘనంగా నిర్వహించారు.రాష్ట్ర వ్యాప్తంగా దేశమే ఆశ్చర్యపోయేలా లోటు బడ్జెట్ లోనూ అవ్వతాతలు,దివ్యాంగులు,ఒంటరి మహిళలు, వితంతువులు,కిడ్నీ బాధితులు, తదితరులకు ఏ లోటూ రాకుండా ఏ మాత్రం ఆలస్యం కాకుండా తూచా తప్పకుండా ప్రతినెలా పెద్దకొడుకై 1వ తేదీకెల్లా పెంచిన పెన్షన్లను ఇంటి ముంగిటే ఏ మాత్రం అక్రమాలు, అవకతవకలకు ఆస్కారం లేకుండా అందిస్తున్న గొప్పదనం,ఘనత మన కూటమి ప్రభుత్వానికే చెండుతుందన్నారు. కాగా ఆంద్ర రాష్ట్రాన్ని అప్పుల అంధ్రప్రదేశ్ గా అప్పుల కూపంలో నెట్టివేసిన గత ప్రజావ్యతిరేక వైసీపీ పాలనలో చతికిలబడ్డ రాష్ట్రాన్ని చరిత్రలో నిలిపేలా ప్రజా సంక్షేమం, సంరక్షణల కొరకు మరియు ఎస్సి,ఎస్టీ,బిసి,మైనార్టీ,ఓబీసీ,ఓసి, లతో పాటుగా సకల వర్గాల సమిష్టి సంక్షేమ సాధికారతలకు అత్యధిక స్థాయిలో 3,22,359 కోట్ల సంక్షిప్త, ప్రజాపక్షపాత హర్షాతిరేక బడ్జెట్ ను కేటాయించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆర్థిక శాఖ మాత్యులు పయ్యావుల కేశవ్ మరియు యువనాయకుడు ఐ.టి,విద్యా, శాఖ మాత్యులు నారా లోకేష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, టిడిపి నాయకులు లక్ష్మన్న, మల్లికార్జున, టిడిపి సోషల్ మీడియా ఇంచార్జ్ ఖాదర్ బాష మరియు కూటమి నాయకులు, పెన్షన్ దారులు తదితరులు పాల్గొన్నారు.