బిజినవేములలో ఎద్దుల పోటీలు ప్రారంభం..
1 min read
నందికొట్కూరు న్యూస్ నేడు : నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని బిజినవేముల గ్రామంలో మంగళవారం ఎద్దుల పోటీలను ప్రారంభించారు.గ్రామంలో శ్రీశ్రీ గణపతి సహిత శ్రీలక్ష్మీ సత్యనారాయణ స్వామి,శ్రీ సీతా లక్ష్మణ హనుమ సమేత,శ్రీ రామచంద్రస్వామి, హనుమత్ ధ్వజ, వృషభ ధ్వజ,ఆలయ శిఖర సహిత, శ్రీ వీరాంజనేయ స్వామి,శ్రీ రాధా కృష్ణ,వీరబ్రహ్మేంద్ర స్వాముల ప్రతిష్ఠా మహోత్సవం సందర్బంగా అంత రాష్ట్ర ఎద్దుల పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి సీనియర్ నాయకులు మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి,గ్రామ సర్పంచ్ రవి యాదవ్ రిబ్బన్ కట్ చేసి ఎద్దుల పోటీలను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మిడుతూరు మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి,రాష్ట్ర యాదవ సంఘం డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్,నందికొట్కూరు పట్టణ కన్వీనర్ భాస్కర్ రెడ్డి, పగిడ్యాల మండల కన్వీనర్ పలుచాని మహేశ్వర్ రెడ్డి,మల్లికార్జున రెడ్డి,కాగుల శంకర్,దేవాలయ కమిటీ సభ్యులు,గణేష్ యూత్, గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు.