NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బిజినవేములలో ఘనంగా విగ్రహ ప్రతిష్ట..

1 min read

హాజరైన మాండ్ర శివానందరెడ్డి,భారీగా ప్రజానీకం

నందికొట్కూరు న్యూస్​ నేడు:  నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని బిజినవేముల గ్రామంలో శ్రీశ్రీ గణపతి సహిత శ్రీలక్ష్మీ సత్యనారాయణ స్వామి,శ్రీ సీతా లక్ష్మణ హనుమ సమేత,శ్రీ రామచంద్రస్వామి,హనుమత్ ధ్వజ,వృషభ ధ్వజ,ఆలయ శిఖర సహిత,శ్రీ వీరాంజనేయ స్వామి,శ్రీ రాధా కృష్ణ, వీరబ్రహ్మేంద్ర స్వాముల ప్రతిష్ఠా మహోత్సవం గురువారం ఘనంగా జరిగాయి.వేద పండితుల నడుమ పూజా కార్యక్రమాలు అదే విధంగా మహిళలు చిన్నారులు బంధు మిత్రులు దేవాలయాల్లో టెంకాయలు కొడుతూ ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి మహిళలు చిన్నారులు బంధువులు అధిక సంఖ్యలో హాజరు కావడంతో గ్రామం కిక్కిరిసిపోయింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి,మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి హాజరై ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.వీరికి గ్రామ సర్పంచ్ రవి యాదవ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.ఉదయం ఆత్మకూరు నల్లకాల్వ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు యాదవ్ సోదరి కుమార్తె వివాహానికి శివానందరెడ్డి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాతా రమేష్ రెడ్డి,మద్దిలేటి,జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

About Author