మండలానికి 50% రాయితీతో రైతులకు ఎరువులు మంజూరు
1 min readమండల వ్యవసాయ అధికారి కే శ్రీదేవి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: చెన్నూరు మండలంలో ఖరీఫ్2024 సీజన్ గాను జీలగ 150 క్వింటాళ్లు 20 క్వింటాళ్లు జనుము విత్తనాలు 50 శాతం సబ్సిడీపై రైతులకు మంజూరైనట్లు మండల వ్యవసాయ అధికారి కే శ్రీదేవి తెలిపారు. రైతులు రైతు భరోసా కేంద్రాల్లో తమ వద్ద ఉన్న పట్టాదార్ పాస్ పుస్తకం. ఆధార్ కార్డు మొబైల్ ఫోన్ నెంబర్ తీసుకొని తమ పేర్లు నమోదు చేసుకోవాలని రైతులకు సూచించారు. ప్రతి రైతు రైతు భరోసా కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు రైతు భరోసా కేంద్రాల్లో అవకాశం కల్పించామని తెలిపారు జీలగ విత్తనాలు కేజీ 88 రూపాయలు నిర్ణయించగా ప్రభుత్వం వాటా 44 రూపాయలు రైతు వాటా 44 నిర్ణయించడం అయిందన్నారు.10 కేజీలు జీలగ విత్తనాల బ్యాగు ఎకరానికి ఒకటి చొప్పున 5 ఎకరాలు గరిష్టంగా ఐదు బ్యాగులు ఇవ్వబడుతుందన్నారు. జనుము విత్తనాలకు కూడా కేజీ 88 రూపాయలు ప్రభుత్వం ధర 44 రైతు వాటా 44 రూపాయలు నిర్ణయించడం అయిందన్నారు. రైతులు ఆయా రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతున్నదని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.