NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెద్దల పంచన.. పేదలకు వంచన….

1 min read

పారిశుద్ధ్య కార్మికులకు మోసం చేసిన చిట్టిల చీటర్ పుల్లయ్యను వెనకేసుకురావద్దు

నాయకులకు బహుజన సమాజ్ పార్టీ అనంతపురం జిల్లా ఇన్చార్జ్ కొత్తూరు లక్ష్మీనారాయణ హితవు

ఎక్స్ లో సీఎం రేవంత్ రెడ్డి, డిజిపి దృష్టికి తెచ్చినట్లు వెల్లడి

చిట్టిల డబ్బులు ఎగ్గొట్టేందుకు అనంతపురం జిల్లా  నాయకుల అండ అండపై లక్ష్మీనారాయణ ఆవేదన

కర్నూలు, న్యూస్​ నేడు:  ఎస్.ఆర్.నగర్ , హైదరాబాద్ : చిట్టిల పేరుతో పారిశుద్ధ్య కార్మికులకు వందల కోట్ల రూపాయలు మోసం చేసిన పుల్లయ్యను  నాయకులు వెనకేతకరావద్దని బహుజన సమాజ్ పార్టీ అనంతపురం జిల్లా ఇన్చార్జ్ కొత్తూరు లక్ష్మీనారాయణ హితవు పలికారు. పారిశుద్ధ్య కార్మికులను నిలువునా ముంచిన పుల్లయ్య విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ దృష్టికి తెచ్చినట్టు లక్ష్మీనారాయణ తెలిపారు. పుల్లయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో కొంత మంది రాజకీయ నాయకుల పంచన చేరినట్టు ప్రచారం జరుగుతుండడంతో లక్ష్మీనారాయణ స్పందించారు. వందల కోట్ల రూపాయలు మోసం చేసిన పుల్లయ్యకు నాయకులు సహకరించొద్దని హితవు పలికారు. పెద్దల పంచన చేరి పేదలకు మోసం చేయడం పుల్లయ్యకు తగదని ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగుడైన తన మిత్రునికి కూడా పుల్లయ్య డబ్బు చెల్లించాల్సి ఉందని లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ ఎగనామం పెట్టాలనే ఉద్దేశంతో పుల్లయ్య న్యాయ నిపుణులను ఆశ్రయించినట్లు ప్రచారం జరుగుతుండడంతో తాను  అనంతపురంలోని ఒక ప్రముఖ న్యాయవాదిని కలిసి వికలాంగుడైన తన మిత్రునికి డబ్బు చెల్లించి న్యాయం చేసే విధంగా చూడాలని న్యాయవాదిని కోరినట్లు లక్ష్మీనారాయణ తెలిపారు. బాధితులంతా కూడా వికలాంగుడైన తన మిత్రుని లాగానే మోసపోయారని, బాధితులు అందరికీ కూడా న్యాయం చేసే విధంగా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తెచ్చినట్లు తెలిపారు. పుల్లయ్య పథకం ప్రకారమే అందరి వద్ద డబ్బు సేకరించి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని లక్ష్మీనారాయణ అనుమానం వ్యక్తం చేశారు. గుత్తిలోని భవనం కూడా తన కూతురికి సంబంధించినది అని పుల్లయ్య ప్రచారం చేస్తున్నాడని, బాధితులందరూ కూడా తెలుసుకోవాలని లక్ష్మీనారాయణ సూచించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *